https://oktelugu.com/

National Awards: వచ్చే సంవత్సరం ఉత్తమ నటుడిగా ‘నేషనల్ అవార్డ్స్’ కోసం పోటీ పడనున్న తెలుగు స్టార్ హీరోలు వీళ్లే…

సినిమా అనేది ఒక వ్యసనం...మన హీరోలు వాళ్ల సినిమాలతో మనలో కొందరిని సినిమా పిచ్చొల్లు గా మారుస్తూ ఉంటారు. నిజానికి ఒక హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ హీరోల అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు...

Written By:
  • Gopi
  • , Updated On : August 17, 2024 / 11:05 AM IST

    National Awards

    Follow us on

    National Awards: తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది. కొత్త రకం కథలతో యంగ్ డైరెక్టర్లు మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక స్టార్ డైరెక్టర్లు సైతం తమ పరిధిని పెంచుకుంటూ పాన్ ఇండియా రేంజ్ లో మంచి సక్సెస్ ఫుల్ సినిమాలను తీస్తూ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ టాప్ ఇండస్ట్రీ గా కొనసాగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక మొత్తానికైతే టాలీవుడ్ బాలీవుడ్ కి భారీ షాక్ ఇస్తూ ముందుకు దూసుకెళ్లడం ఒక వంతుకు మనలో ఉత్సాహాన్ని నింపుతుంటే, బాలీవుడ్ కి మాత్రం చిరాకు తెప్పిస్తుందనే చెప్పాలి. ఎవరు ఏమనుకున్నా ఇప్పుడప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీ ని టచ్ చేసే ఇండస్ట్రీ ఇండియాలో మరొకటి లేదు అనేది మాత్రం వాస్తవం… ఇక రాబోయే కొద్ది సంవత్సరాల వరకు ఇండియా లో తెలుగు సినిమా మేనియానే కొనసాగబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ‘ పుష్ప ‘ సినిమా కోసం అల్లు అర్జున్ మొదటిసారిగా నేషనల్ అవార్డుని తీసుకున్నాడు. ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకి కూడా నేషనల్ అవార్డు రాలేదు.

    ఇక ఇప్పుడు మన సినిమాలు సక్సెస్ అవ్వడమే కాకుండా మన వాళ్ళకి అవార్డులు కూడా రావడం స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఇక మీదట నుంచి వచ్చే ప్రతి నేషనల్ అవార్డు ల్లో మన హీరోలు ఉంటారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి అయితే లేదు… ఇక ఈ సంవత్సరం నేషనల్ అవార్డు కోసం ఇద్దరు హీరోలు భారీగా పోటీపడే అవకాశాలు అయితే ఉన్నాయి. అందులో ఒకరు ఎన్టీఆర్ కాగా, మరొకరు అల్లు అర్జున్… ‘దేవర’ సినిమాతో తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు అంటూ సినిమా యూనిట్ నుంచి భారీ లీకులైతే బయటికి వస్తున్నాయి.

    మరి ఈ సినిమా నుంచి రీసెంట్ గా సైఫ్ అలీ ఖాన్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. అది చాలా అద్భుతంగా ఉండటమే కాకుండా సినిమా మీద భారీ అంచనాలను కూడా పెంచేస్తుంది. ఇక ఎన్టీఆర్ కూడా తన నట విశ్వరూపంతో నేషనల్ అవార్డు ని అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ సైతం మరోసారి నేషనల్ అవార్డు మీద కన్నేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇంతకు ముందు మొదటి పార్ట్ లో ఎలా నటించాడో ఇప్పుడు పుష్ప 2 లో అంతకు మించి అనేలా నటించి మెప్పించడానికి రెడీ అవుతున్నాడు.

    మరి ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో సినిమా యూనిట్ నుంచి మరోసారి అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వస్తుంది అంటూ భారీగా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇక వీళ్లిద్దరిలోనే ఈ సంవత్సరం భారీ పోటీ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది…