Puri Jagannadh And Harish Shankar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళలో పూరి జగన్నాథ్, హరీష్ శంకర్ లు ప్రథమ స్థానంలో ఉంటారు. ఒకప్పుడు వీళ్లిద్దరి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తి ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం వీళ్లు చాలా వరకు గాడి తప్పారనే చెప్పాలి. పూరి జగన్నాథ్ దాదాపు పది సంవత్సరాల నుంచి తన సినిమా కెరియర్ చాలా డల్ గా నడుస్తుంది. 2019 వ సంవత్సరంలో ‘ఇస్మార్ట్ శంకర్’ తో మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ అది ఆయన స్థాయి సక్సెస్ అయితే కాదు. అయినప్పటికీ అడపా దడప సినిమాలను చేసుకుంటు కెరియర్ ను నెట్టుకుంటూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాతో ఒకసారిగా బొక్క బోర్లా పడ్డాడు. ఇక పూరి జగన్నాధ్ పరిస్థితి ఇలా ఉంటే హరీష్ శంకర్ కూడా ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడనే చెప్పాలి. ఒకప్పుడు వీళ్ళు గురు శిష్యులుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
ఇక ఇప్పుడు వీళ్లిద్దరు ఒకే సమయంలో భారీ ఫ్లాప్ లను అందుకొని నిండా మునగడం అనేది వల్ల అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేస్తుందనే చెప్పాలి. ఇక వీళ్లు ఇలాంటి ఫ్లాపులను ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే మేము ఏ సినిమా చేసిన ప్రేక్షకులు ఆదరిస్తారు అనే ఒక ఓవర్ కాన్ఫిడెంట్ వల్లే వీళ్ళ సినిమాలు డిజాస్టర్లుగా మారుతున్నాయి. నిజానికి ఒక సినిమా చేయాలి అంటే దానికి ముందు చాలా వరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే చేసుకోవాలి. అలాగే ఒక షాట్ ఎలా తీయాలి.
ఒక సినిమా స్టోరీ ఎలా ఉండాలి అది ఎలా ఉంటే ప్రేక్షకుడికి రీచ్ అవుతుంది అనే ఆలోచనలు ఒకటికి పది సార్లు ఆలోచించుకొని కథలో లాజిక్కులను సరిగ్గా చెక్ చేసుకొని, ఎమోషన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేవి అన్ని చూసుకొని మరి సినిమా తీయడానికి రంగంలోకి దిగాలి. అప్పుడు మాత్రమే సక్సెస్ అనేది వరిస్తుంది. ‘ఈజీగా వస్తే సక్సెస్ కి కూడా వాల్యూ ఉండదు’ అన్నట్టుగా తయారైంది వీళ్ళ వైఖరి… ఒకప్పుడు భారీ సక్సెస్ లను అందుకున్నా వీళ్ళు ఆ స్టార్ డమ్ ని కొనసాగిస్తూ మరింత ముందుకెళ్లాలి కానీ ఆ స్టార్ డమ్ ను ఆసరాగా తీసుకొని మనం ఏం చేసినా చెల్లుతుంది అంటే చివరికి ఇలాంటి ఫ్లాపులు ఎదుర్కొక తప్పదు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది…
ఇక మొత్తానికైతే ఈ ఇద్దరు కమర్షియల్ డైరెక్టర్లు భారీ ఫ్లాప్ లను పొందడం అటు అభిమానులకు, ఇటు ట్రేడ్ పండితులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటే అందరికీ మంచిది. దీనివల్ల దర్శకులు మరో సినిమాను తొందరగా స్టార్ట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల సినీ కార్మికుడికి కూడా పని దొరుకుతుంది. ఇక సక్సెస్ వస్తే అన్ని ఫస్ట్ గా జరుగుతాయి. ఫెయిల్యూర్ వస్తే మాత్రం ప్రతి ఒక్కరు నష్ట పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది…