Chiranjeevi: మూస ధోరణిలో సాగుతున్న సినిమా ఇండస్ట్రీ ని తన కథల ఎంపికలో గాని, తన డ్యాన్స్ లో గాని, నటనలో గాని వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కించిన నటుడు చిరంజీవి… అప్పటివరకు ఒక ట్రెండ్ లో ఉన్న సినిమా ఇండస్ట్రీ ని ఒక్కసారిగా టాప్ లెవెల్లోకి తీసుకెళ్లిన ఘనత కూడా చిరంజీవికే దక్కుతుంది. దాదాపు 40 సంవత్సరాల నుంచి మెగాస్టార్ గా కొనసాగుతున్నాడు. అయితే ఒకానొక సమయంలో చిరంజీవి ‘సుప్రీం ‘ హీరో నుంచి మెగాస్టార్ గా ఎదుగుతున్న క్రమంలో ఆయన మీద చాలా మంది హీరోలు చాలా కుట్రలు చేశారు. ఇక మెగాస్టార్ గా మారిన తర్వాత అయితే ఓపెన్ గా మోహన్ బాబు లాంటి నటుడు చిరంజీవి మీద జలసిని ప్రదర్శిస్తూ అతన్ని ఏదో ఒక రకంగా డీ గ్రేడ్ చేయాలనే ఉద్దేశ్యం తో చాలా ఈవెంట్లలో ఓపెన్ గానే చిరంజీవి మీద చాలా కామెంట్లు చేశాడు… ఇక జీవిత రాజశేఖర్ లాంటి వాళ్లు కూడా చిరంజీవి మీద ఓపెన్ గా ఆయన మంచివాడు కాదు అనేంతల ఆయన మీద నెగటివ్ ప్రచారం అయితే చేశారు. ప్రజా రాజ్యం పార్టీ పెట్టిన సమయంలో కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంకు నుంచి బ్లడ్ అమ్ముకుంటున్నాడు అంటూ పలు రకాల కామెంట్స్ చేశారు. అయినప్పటికీ చిరంజీవి మాత్రం ఎవరు ఏమన్నా సైలెంట్ గానే ఉన్నాడు.
ఇక అల్లు అరవింద్ జీవిత రాజశేఖర్ల మీద పెట్టిన కేసు వల్ల చిరంజీవి మీద జీవిత రాజశేఖర్లు చేసిన కామెంట్లు అబద్ధమని కోర్టు తెలియజేస్తూ వాళ్లకి జరిమానా కూడా విధించింది. ఇలా ఆయన మీద దూషించి ఆయన్ను తగ్గించే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఎప్పటికప్పుడు ఆయన వాళ్లు ఎంత తగ్గించాలని చూసిన అంతకంతకు పైకి ఎదిగాడే తప్ప వాళ్ల కామెంట్లకు కృంగిపోలేదు.
ఇక మొత్తానికైతే చిరంజీవి అప్పటినుంచి ఇప్పటివరకు శ్రమిస్తూ తనను తాను స్టార్ హీరోగా మలుచుకొని సినిమా కోసం భారీ ఎఫెర్ట్ పెట్టి భారీ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి ఈ ఏజ్ లో కూడా స్టార్ హీరోగా గుర్తింపు పొందుతూ ముందుకు సాగడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ ముందుకు సాగుతున్న చిరంజీవి ఇప్పుడు విశ్వంభర సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు.
ఈ సినిమాతో కనుక భారీ సక్సెస్ కొట్టినట్టు అయితే ఆయన సీనియర్ హీరోల్లో టాప్ హీరోగా ఎదగడమే కాకుండా ఆయనలాంటి హీరో సౌత్ ఇండస్ట్రీలో మరొకరు లేరు అనేది చాలా స్పష్టంగా ప్రూవ్ అవుతుంది. ఇక విశ్వం భర పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఆయనకు బాలీవుడ్ లో కూడా భారీగా మార్కెట్ ఏర్పడే అవకాశాలైతే ఉన్నాయి…