Indian youth : విదేశాలకు భారీగా తరలుతున్న భారతీయ యువత.. కారణం ఇదే..

2024 కేంద్ర బడ్జెట్ ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారమన్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ సందర్భంగా పన్ను విధానంలో మార్పులు చేశారు. స్టాండర్డ్ డిటక్షన్ రూ.50 వేల నంచి రూ. 75 వేలకు పెంచారు. ఇదే సమయంలో దీర్ఘ కాలిక పెట్టుబడులపై 12 శాతం, స్వల్ప కాలిక మూలధన లాభాలపై 20 శాతం పెంచారు. దీంతో చాలా మంది యువత ఈ పన్నుల భారం పడలేకపోతుందని తెలుస్తోంది.

Written By: Srinivas, Updated On : August 11, 2024 12:20 pm
Follow us on

Indian youth : భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం.. ఇది ఎప్పటి నుంచో చదువుతున్నదే. ప్రపంచ దేశాలతో ఎన్నో విషయాల్లో పోటీ పడుతున్న భారత్ అభివృద్ధి చెందిన దేశం అని ఎప్పుడు అనిపించుకుంటుందోనని చాలా మంది ఎదురుచూస్తున్నారు. అంతరిక్షం, క్రీడలు, ఇతర విషయాల్లో భారత్ మిగతా దేశాల కంటే మెరుగైనప్రతిభను కనబరుస్తుంది. కానీ మానవ వనరుల అభివృద్ధి విషయంలో రోజురోజుకు క్షీణిస్తుంది. ఇది గ్రహించిన చాలా మంది తమ భవిష్యత్ కోసం దేశాన్ని విడిచి వెళుతన్నారు. ఉన్నత చదువులకోసమని విదేశాలకు వెళ్తున్న యువత అక్కడే సెటిలవుతోంది. ఇక్కడి నుంచి తమ కుటుంబాన్ని తీసుకెళ్లి విదేశీ పౌరులుగా మారుతున్నారు. ప్రస్తుతం పలు దేశాల్లో భారత్ సంతతికి చెందిన వారే మంచి పొజిషన్లో ఉన్నారు. మున్ముందు మరింత మంది ఇలాంటి వారు కనిపిస్తారు. అయితే భారత్ నుంచి ఇలాంటి నైపుణ్యం ఉన్నవారు ఎందుకు తరలిపోతున్నారు? భారత్ లో ఉన్న మైనస్ ఏంటి? ఆ వివరాల్లోకి వెళితే..

2024 కేంద్ర బడ్జెట్ ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారమన్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ సందర్భంగా పన్ను విధానంలో మార్పులు చేశారు. స్టాండర్డ్ డిటక్షన్ రూ.50 వేల నంచి రూ. 75 వేలకు పెంచారు. ఇదే సమయంలో దీర్ఘ కాలిక పెట్టుబడులపై 12 శాతం, స్వల్ప కాలిక మూలధన లాభాలపై 20 శాతం పెంచారు. దీంతో చాలా మంది యువత ఈ పన్నుల భారం పడలేకపోతుందని తెలుస్తోంది. కొందరు ఉన్నతంగా ఎదగాలని చూసినా వారికి పన్నుల రూపంలో అడ్డు తగులుతున్నట్లు తెలుస్తోంది. మిగతా దేశాలతో పోలిస్తే భారత్ లో నైపుణ్యం కలవారు ఎక్కువ. అందుకే చాలా దేశాలు ఇండియాకు చెందిన వారు నియమించుకుంటున్నారు. భారత్ కంటే ఎక్కువ స్థాయిలో వేతనాలు అందిస్తూ పన్ను మినహాయింపు ప్రకటిస్తున్నారు.

2023 లెక్కల ప్రకారం భారత్ నుంచి 13.2 లక్షల మంది 68 దేశాలకు ఉన్నత విద్యకోసం తరలివెళ్లారు. వీటిలో అత్యధికంగా కెనడాలో 4.27 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. ఆ తరువాత అమెరికాలో 3.51 లక్షలు, యూఏఈలో 2.47 లక్షలు, ఆస్ట్రేలియాలో 1.25 లక్షల మంది తరలివెళ్లారు. దశాబ్ద కాలంలో భారతీయ పౌరులపై ప్రభుత్వాలు అధిక పన్నుభారం వేస్తున్నాయి. కొందరు మెరుగైన ఉద్యోగాలు సాధించినప్పటికీ వారికి వచ్చే ఆదాయంలో పన్ను చెల్లించడమే ఎక్కువవుతోంది. ఈ కారణంగా విదేశాలకు వెళ్తున్నారు.

ఇప్పటి వరకు విదేశాలకు వెళ్లిన వారు తమ కుటుంబాలను తీసుకెళ్తే 1 కోటి జనాభా తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా విదేశాల్లో చదివే విద్యార్థులు తమ విద్య కోసం రూ.33 కోట్లు వెచ్చిస్తున్నారు. భారత్ ఈ ఆదాయాన్ని కోల్పోతున్నట్లే చెప్పారు. అయితే మెరుగైన విద్య అందిస్తూ పన్నుల భారం తగ్గిస్తే ఈ ఆదాయం వచ్చే అవకాశం ఉందని కొందరు ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ పన్ను విధానంలో మార్పులు తీసుకురాకపోతే మున్ముందు భారత్ లో నైపుణ్యం కలిగిన విద్యార్థులు కనిపించరని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కొందరు కోరుతున్నారు.