https://oktelugu.com/

Telugu Heroines: ఒకే హీరోకు భార్యగా, తల్లిగా నటించిన హీరోయిన్స్ వీళ్ళే !

Telugu Heroines: సినిమా అంటేనే లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు చూపించడం. ఇక నటీనటుల పాత్రల విషయంలో ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. అయితే, ఒకే హీరో సరసన హీరోయిన్ గా నటించి.. ఆ తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత అదే హీరోకు తల్లిగా నటించిన నటీమణులు ఉన్నారు. నాటి భానుమతి నుంచి నేటి అనుష్క శెట్టి వరకు ఇలాంటి నటీమణులు కొందరు తమ నటనతో ఆకట్టుకున్నారు. మరి ఆ హీరోలు ఎవరో తెలుసా ? […]

Written By:
  • Shiva
  • , Updated On : February 15, 2022 / 12:21 PM IST
    Follow us on

    Telugu Heroines: సినిమా అంటేనే లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు చూపించడం. ఇక నటీనటుల పాత్రల విషయంలో ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. అయితే, ఒకే హీరో సరసన హీరోయిన్ గా నటించి.. ఆ తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత అదే హీరోకు తల్లిగా నటించిన నటీమణులు ఉన్నారు. నాటి భానుమతి నుంచి నేటి అనుష్క శెట్టి వరకు ఇలాంటి నటీమణులు కొందరు తమ నటనతో ఆకట్టుకున్నారు.

    మరి ఆ హీరోలు ఎవరో తెలుసా ? నాటి ఎన్టీఆర్, క్రిష్ణ నుంచి చిరంజీవి తో పాటు ప్రభాస్ వరకు ఇలాంటి పాత్రలలో నటించారు. ఒకప్పటి తమ హీరోయిన్నే అమ్మ అని పిలిచారు. ఇంతకీ అలా నటించిన హీరోయిన్లు ఎవరో చూద్దాం.

    భానుమతి

    Bhanumathi, ntr

    అలనాటి అద్భుత నటి భానుమతి. ఆమె ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించింది. అలాంటి తను 1992లో వచ్చిన సామ్రాట్ అశోక సినిమాలో ఎన్టీఆర్ కు తల్లిగా నటించి మెప్పించింది.

    Also Read:  పవన్ కళ్యాణ్ పక్కన అలా కూర్చుని షాక్ ఇచ్చిన ‘హైపర్ ఆది’

    అంజలి దేవి

    Anjali Devi, ANR

     

    నాగేశ్వరరావుతో కలిసి ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది అంజలి దేవి. అనంతరం పలు సినిమాల్లో ఏఎన్ఆర్ కి తల్లిగా కూడా నటించి మెప్పించింది.

    సుజాత

    Chiranjeevi Sujatha

     

    దివంగత నటీమణి సుజాత కూడా చిరంజీవితో హీరోయిన్ గా నటించి అలరించింది. ఆ తర్వాత బిగ్ బాస్ సినిమాలో చిరంజీవి తల్లిగా చేసింది.

    భానుప్రియ

    Venkatesh – Bhanupriya

     

    జయం మనదేరా సినిమాలో వెంకటేష్ తల్లిగా నటించింది ఆమె. అదే సినిమాలో సీనియర్ వెంకటేష్ కు భార్యగానూ నటించింది. ఇక అంతకు ముందు శ్రీనివాస కల్యాణం, స్వర్ణకమలం వంటి పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి మెప్పించింది.

     

    అనుష్క శెట్టి

    prabhas anushka

    బాహుబలి సినిమాలో సీనియర్ ప్రభాస్ కు భార్యగా.. జూనియర్ ప్రభాస్ కు తల్లిగా నటించి మెప్పించింది అనుష్క శెట్టి.

    Also Read:  ప్రేమలో పడిన శ్రీముఖి.. మాట్లాడదాం అంటుంది

    Tags