https://oktelugu.com/

Aparna: ‘సుందరకాండ’ సెకండ్ హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు ?

Aparna: లెక్చరర్ ను ప్రేమించే ఒక అల్లరి పిల్ల కథ ‘సుందరకాండ’. వెంకటేష్ లెక్చరర్ గా నటించగా.. ఆ అల్లరి పిల్లగా అపర్ణ అనే అమ్మాయి నటించింది. నిజానికి ఈ పాత్ర కోసం ఓ స్టార్ హీరోయిన్ ని తీసుకోవాలనుకున్నారు రాఘవేంద్ర రావు గారు. కానీ, ఏ హీరోయిన్ ఆ పాత్రకు అంతగా సూటవ్వకపోవడంతో ఇక చేసేది ఏమి లేక.. కొత్త అమ్మాయిని వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఓ రోజు నిర్మాత కె.వి.వి,సత్యనారాయణ గారి ఇంటికి వెళ్లారు […]

Written By:
  • Shiva
  • , Updated On : February 15, 2022 / 10:57 AM IST
    Follow us on

    Aparna: లెక్చరర్ ను ప్రేమించే ఒక అల్లరి పిల్ల కథ ‘సుందరకాండ’. వెంకటేష్ లెక్చరర్ గా నటించగా.. ఆ అల్లరి పిల్లగా అపర్ణ అనే అమ్మాయి నటించింది. నిజానికి ఈ పాత్ర కోసం ఓ స్టార్ హీరోయిన్ ని తీసుకోవాలనుకున్నారు రాఘవేంద్ర రావు గారు. కానీ, ఏ హీరోయిన్ ఆ పాత్రకు అంతగా సూటవ్వకపోవడంతో ఇక చేసేది ఏమి లేక.. కొత్త అమ్మాయిని వెతుకుతున్నారు.

    Aparna

    ఈ క్రమంలో ఓ రోజు నిర్మాత కె.వి.వి,సత్యనారాయణ గారి ఇంటికి వెళ్లారు రాఘవేంద్ర రావు గారు. అక్కడ ఒక అమ్మాయి ఆయనకు బాగా నచ్చింది. ఆ అమ్మాయి అయితే.. తన సినిమాలోని పాత్రకు బాగా సూట్ అవుతుందని ఆయన భావించారు. కానీ, ఎలా అడిగేది ? అసలు ఆ అమ్మాయి ఎవ్వరో ? సినిమాలు చేస్తుందా ? పైగా నిర్మాత ఇంట్లో ఉంది అంటే.. ఉన్నతమైన కుటుంబం.

    Also Read:  ప్రేమలో పడిన శ్రీముఖి.. మాట్లాడదాం అంటుంది

    అందుకే రాఘవేంద్ర రావు గారు అప్పుడు ఆ అమ్మాయిని నా సినిమాలో నటిస్తావా ? అని అడగలేదు. కట్ చేస్తే.. పది రోజుల తర్వాత.. హీరోయిన్ కోసం జరుగుతున్న ఆడిషన్స్ లో ఆ అమ్మాయి కనిపించింది. ఎవరు ఆ అమ్మాయి ? నిర్మాత కె.వి.వి,సత్యనారాయణ గారి మేనకోడలు సర్. పేరు అపర్ణ. అన్నారు అసిస్టెంట్. ఆమెను ఓకే చేసేయండి అన్నారు రాఘవేంద్ర రావు గారు.

    అలా అపర్ణని తీసుకున్నారు. అసలు ఆమెకు నటన వచ్చా ? రాదా ? అని సెట్ కి వెళ్లే వరకు ఆమె ఎలా నటిస్తుందో అని అందరూ టెన్షన్ పడ్డారు. కానీ ఆమె అద్భుతంగా నటించి షాకిచ్చింది. దాంతో ఆమెకు ఆ తర్వాత హీరోయిన్‌గా చాలా అవకాశాలు వచ్చాయి. కానీ, సినిమాల్లో హీరోయిన్ గా నటించడానికి ఆమె కుటుంబం అంగీకరించలేదు. కాకపోతే.. దాసరి నారాయణ రావు తెరకెక్కించిన అక్క పెత్తనం చెల్లెలి కాపురం అనే సినిమాలో మాత్రం ఆమె నటించింది.

    Aparna

    ఆ తర్వాత 2002లో పెళ్ళి చేసుకొని అమెరికా వెళ్ళిపోయి.. అక్కడే సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె సినిమాలకి దూరంగా ఉంది. ఇక 1992లో వచ్చిన ఈ రీమేక్ సినిమాలో వెంకటేశ్ – మీనా జంటగా నటించారు. తెలుగులో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మాస్ ఇమేజ్ సినిమాలు వెంకీ ఈ సినిమాలో కాలెజీ లెక్చరర్ పాత్రలో క్లాస్ గా కనిపించి ఆకట్టుకున్నాడు.

    వాస్తవానికి మొదట లెక్చరర్ క్యారెక్టర్ తనకు సూట్ కాదు అని చాలామంది వెంకటేశ్ కి సలహాలిచ్చారట. అయినా వెంకటేశ్ మాత్రం కథ పై, అలాగే రాఘవేంద్ర రావు పై నమ్మకంతో సుందరకాండ సినిమాలో నటించాడు. అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు.

    Also Read: కేసీఆర్ పైనా బీజేపీది అదే సర్జికల్ స్ట్రైక్

    Tags