https://oktelugu.com/

VB Rajendra Prasad: ఆ స్టార్ హీరోకి తండ్రే రోజు ‘హాఫ్ బాటిల్’ మందు పంపేవారట !

VB Rajendra Prasad: తెలుగు తెరకు ఎన్నో అద్భుత చిత్రాలను అందించిన ఘనత ఉంది ‘జగపతి ఆర్ట్ పిక్చర్స్’ కి. ఆరాధన, ఆత్మబలం, అక్క చెల్లెలు, దసరాబుల్లోడు లాంటి గొప్ప హిట్ చిత్రాలతో జగపతి ఆర్ట్ పిక్చర్స్ టాలీవుడ్ లో గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. ఈ బ్యానర్ అధినేత అయిన వి.బి.రాజేంద్రప్రసాద్ కి గొప్ప విజన్ ఉంది. పైగా ఏఎన్నార్ తో ఆయనది ప్రత్యేక బంధం. అందుకే.. ఎక్కువగా ఏఎన్నార్ తో అనేక చిత్రాలను రూపొందించారు […]

Written By:
  • Shiva
  • , Updated On : February 15, 2022 / 12:36 PM IST

    VB Rajendra Prasad

    Follow us on

    VB Rajendra Prasad: తెలుగు తెరకు ఎన్నో అద్భుత చిత్రాలను అందించిన ఘనత ఉంది ‘జగపతి ఆర్ట్ పిక్చర్స్’ కి. ఆరాధన, ఆత్మబలం, అక్క చెల్లెలు, దసరాబుల్లోడు లాంటి గొప్ప హిట్ చిత్రాలతో జగపతి ఆర్ట్ పిక్చర్స్ టాలీవుడ్ లో గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. ఈ బ్యానర్ అధినేత అయిన వి.బి.రాజేంద్రప్రసాద్ కి గొప్ప విజన్ ఉంది. పైగా ఏఎన్నార్ తో ఆయనది ప్రత్యేక బంధం. అందుకే.. ఎక్కువగా ఏఎన్నార్ తో అనేక చిత్రాలను రూపొందించారు ఆయన.

    VB Rajendra Prasad

    వి.బి.రాజేంద్రప్రసాద్ గారి కుమారుడే జగపతిబాబు. మద్రాస్ లో విద్యాభ్యాసం కొనసాగిస్తున్న సమయంలో జగపతిబాబుకి సినిమాల పై అస్సలు ఆసక్తి లేదు, అందుకే అయన ఎట్టిపరిస్థితుల్లో సినిమాల్లోకి రాకూడదని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే జగపతిబాబు తన విద్యాభ్యాసం ముగిసిన తర్వాత, వైజాగ్ వెళ్లి వ్యాపారం స్టార్ట్ చేశారు.

    Also Read:  ‘సుందరకాండ’ సెకండ్ హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు ?

    అయితే, వ్యాపారం చేసే సమయంలో ఆయనకు సినిమాల పై మోజు పెరిగింది. దాంతో తన తండ్రికి తెలియకుండా సినిమా ప్రయత్నాలు స్టార్ట్ చేసినా ఎవ్వరూ అవకాశం ఇవ్వలేదు. ఈ విషయం తెలిసింది వి.బి.రాజేంద్రప్రసాద్ గారికి. జగపతిబాబుని పిలిపించి మాట్లాడారు. అలా జగపతిబాబు హీరోగా వి.బి.రాజేంద్రప్రసాద్ ఓ‌చిత్రం తీశారు.

    మధుసూదన్ రావు దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా ‘సింహస్వప్నం’ అనే సినిమా విడుదలైంది. జగపతిబాబు తన మొదటి చిత్రంలో ద్విపాత్రాభినయంలో నటించాడు. పైగా ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఒక కీలక పాత్రలో కూడా నటించారు. సినిమా దారుణంగా ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత జగపతి బభౌ హీరోగా ‘అడవిలో అభిమన్యుడు’ అనే చిత్రం రిలీజ్ అయ్యింది.

    jagapathi babu

    ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ, ఈ చిత్రం కోసం జగపతిబాబు బాగా కష్టపడ్డారు. సినిమా అడవి నేపథ్యంలో కాబట్టి.. కొండలు, గుట్టలు ఎక్కడం నీళ్ళలో ఈదటం లాంటి కొన్ని కష్టమైన షాట్స్ లో కూడా నటించారు. ఓ దశలో షూటింగ్ చేయడం చాలా కష్టం అయ్యింది.

    జగపతి బాబు కష్టాన్ని చూసి రోజు ఒక ‘హాఫ్ బాటిల్’ మందుని పంపించారట. ఆ రోజుల్లోనే కొడుక్కి మందు బాటిల్ పంపి వి.బి.రాజేంద్రప్రసాద్ షాక్ ఇచ్చారు. ఈ విషయాన్ని జగపతిబాబునే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

    Also Read:  కాంగ్రేసేతర కూటమికి బీజం..? కేసీఆర్, స్టాలిన్ కు మమత ఫోన్

    Tags