Heroes : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకునే కెపాసిటి ఉన్న హీరోలు పాన్ ఇండియాను శాశిస్తున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతుంది. కొత్త కథలను ఎంచుకొని మన దర్శకులు సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటివరకు వాళ్లు సాధించిన విజయాలు అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్కరూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో సినిమా ఇండస్ట్రీ నుంచి భారీగా ఎదురవుతున్న పోటీని తట్టుకొని నిలబడుతున్న మన స్టార్ హీరోలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాశించడంలో ముందుకు సాగుతున్నారు. మరి ఇప్పటివరకు పాన్ ఇండియాలో వెయ్యి కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన తెలుగు స్టార్ హీరోలు ఎవరు? ఆ సినిమాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
బాహుబలి 2
రాజమౌళి తీసిన బాహుబలి సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. ఆ తర్వాత బాహుబలి 2 సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించిన ఆయన లాంగ్ రన్ లో ఈ సినిమా 1900 కోట్ల కలెక్షన్లను రాబట్టి తెలుగు సినిమా స్థాయి ఏంటో చూపించారు. ఇక 1000 కోట్లు వసూలు చేసిన తొలి తెలుగు సినిమాగా ఈ సినిమా భారీ గుర్తింపును సంపాదించుకుంది… దాంతో మొదటిసారి 1000 కోట్లు కలెక్ట్ చేసిన స్టార్ హీరోగా ప్రభాస్ ఒక అరుదైన గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు…
త్రిబుల్ ఆర్
ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా 1300 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇక వరుసగా రెండు సినిమాలతో 1000 కోట్లకు పైన కలెక్షన్స్ లో రాబట్టిన తొలి తెలుగు దర్శకుడిగా కూడా రాజమౌళి రికార్డును క్రియేట్ చేశాడు. ఇక ఇప్పటివరకు ఇలాంటి ఘనతను సాధించిన వారు ఎవరు లేకపోవడం విశేషం… ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయారు…
కల్కి
ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా దాదాపు 1200 కోట్ల కలెక్షన్ల ను రాబట్టి ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా దర్శకుడు అయిన నాగ్ అశ్విన్ ఈ సినిమా ను తీర్చి దిద్దిన విధానం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అందువల్ల ఈ సినిమా కోసం పెట్టిన ప్రతి రూపాయి కూడా స్క్రీన్ మీద కనిపించడమే కాకుండా ప్రేక్షకులందరికి ఒక విజువల్ వండర్ ని చూపించింది. ఇక దాంతో మొదటిసారి నాగ్ అశ్విన్ వెయ్యికోట్ల క్లబ్లో చేరిపోయాడు. ప్రభాస్ రెండోవసారి ఈ సినిమాతో 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టిన హీరోగా గుర్తింపును సంపాదించుకున్నాడు…
పుష్ప 2
పుష్ప 2 సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తూ ముందుకు సాగుతున్న అల్లు అర్జున్ ఈ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో మంచి మార్కెట్ ను క్రియేట్ చేయడంతో దానికి సిక్వెల్ గా వచ్చిన ఈ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాడు…ఇక మొదటిసారి సుకుమార్ ఈ సినిమాతో వెయ్యి కోట్ల కలెక్షన్స్ ను వసూలు చేసిన మూడోవ తెలుగు దర్శకుడిగా సుకుమార్ గొప్ప గుర్తింపును సంపాదించుకుంటే అల్లు అర్జున్ 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టిన నాలుగోవ హీరోగా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు…
ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ 4 సినిమాలు మాత్రమే 1000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి పాన్ ఇండియా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి…