Allu Arjun : మన టాలీవుడ్ నుండి ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా లెవెల్ పరిపూర్ణమైన క్రేజ్, మార్కెట్ ఉన్న హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ‘పుష్ప’ చిత్రం తో ఆయన పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెట్టాడు. ఇక ‘పుష్ప 2’ తో ఇండియా లో నాకు మించిన సూపర్ స్టార్ ఎవ్వరూ లేరు అనే స్థాయిలో నాటుకుపోయాడు. ఈ చిత్రం తర్వాత కూడా అల్లు అర్జున్ కి ఇదే రేంజ్ మార్కెట్ ఉంటుంది. ఎందుకంటే పుష్ప సిరీస్ ఆయనకీ పాన్ ఇండియా లెవెల్ లో అలాంటి ఫ్యాన్ బేస్ ని తెచ్చిపెట్టింది. ఆ ఫ్యాన్ బేస్ ఉండే అంచనాలకు తగ్గట్టుగానే ఆయన తన తదుపరి సినిమాలను సెట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన ద్రుష్టి మొత్తం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోయే సినిమా మీదనే ఉంది. ఈ చిత్రం తర్వాత ఆయన అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్, సందీప్ వంగ వంటి క్రేజీ పాన్ ఇండియన్ డైరెక్టర్స్ తో సినిమాలను సెట్ చేసుకున్నాడు.
వీటిల్లో త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా జనవరి నెలలో మొదలు కాబోతుంది. మన పురాణాలను బేస్ చేసుకొని తెరకెక్కిస్తున్న ఈ పీరియడ్ మూవీకి సుమారుగా 500 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేయబోతున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన సందీప్ వంగ తో చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ గ్యాప్ లో ఆయన మరో సినిమాకి ఓకే చేసినట్టు తెలుస్తుంది. మలయాళం లో స్టార్ హీరో గా కొనసాగుతున్న వారిలో ఒకడు పృథ్వీ రాజ్ సుకుమారన్. ఈయన ‘సలార్’ చిత్రంలో ప్రభాస్ కి స్నేహితుడిగా నటించిన సంగతి తెలిసిందే. పృథ్వీ రాజ్ కేవలం సినీ హీరో మాత్రమే కాదు, దర్శకుడు కూడా. మలయాళం లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. మోహన్ లాల్ తో ఆయన చేసిన ‘లూసిఫర్’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.
ఇదే సినిమాని తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ గా రీమేక్ చేసాడు. ఇప్పుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ మోహన్ లాల్ తో ‘లూసిఫర్ 2’ చేస్తున్నాడు. ఇది కాసేపు పక్కన పెడితే సలార్ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలోనే ప్రభాస్ తో ఒక సినిమా తన దర్శకత్వం లో చేసేందుకు ఒప్పించుకున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ తో కూడా ఆయన ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. రెండు నెలల క్రితమే అల్లు అర్జున్ ని కలిసి ఒక ఆసక్తికరమైన స్టోరీ ని వినిపించాడట. దీనికి అల్లు అర్జున్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. అయితే మలయాళం సినిమాలను మన తెలుగు ఆడియన్స్ అంతగా ఇష్టపడరు. పృథ్వీ రాజ్ మలయాళం ఇండస్ట్రీ కి చెందిన వాడు కాబట్టి, ఆయన టేకింగ్ స్టైల్ అలాగే ఉంటుంది. కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్ ఓకే చేయడం అవసరమా అని సోషల్ మీడియా లో ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.