Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ విడుదల తేదీ దగ్గర పడుతుంది కొద్దీ అభిమానుల గుండె చప్పుడు అతి వేగంగా కొట్టుకుంటుంది. కారణం ఈ సినిమాని కొరటాల శివ అంచనాలకు తగ్గట్టుగా తీసాడా లేదా?, పొరపాటున కూడా ఆచార్య మూవీ స్టైల్ లో తియ్యకపోతే బాగుణ్ణు, కనీసం యావరేజి రేంజ్ లో తీసిన చాలు, ఎన్టీఆర్ కుమ్మేస్తాడు అంటూ అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు విడుదలైన మూడు బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ ని చూసి అభిమానుల్లో ఈ సినిమా మీద ఎలాంటి అనుమానాలు ఉండేవి కాదు, కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే బలమైన నమ్మకంతో ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదలైందో, అప్పటి నుండి అభిమానుల్లో ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు పాతాళంలోకి పడిపోయాయి.
ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ టైం రికార్డు గ్రాస్ ని నెలకొల్పే విధంగా దూసుకుపోతూ ఉండేది. కానీ ఈ ట్రైలర్ విడుదల తర్వాత రోజువారీ టికెట్ అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. కేవలం ఓవర్సీస్ ప్రాంతంలో మాత్రమే కాదు, ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ తగ్గిపోయింది. ఇంతకు ముందు ఈ సినిమాకి కేవలం ఆంధ్ర ప్రదేశ్ నుండి 55 కోట్ల రూపాయలకు థియేట్రికల్ రైట్స్ పలికేవి, కానీ ఇప్పుడు కేవలం 48 కోట్ల రూపాయలకు కుదింపబడింది. రాబోయే రోజుల్లో ఇంకో కోటి రూపాయిల బిజినెస్ తగ్గే అవకాశం కూడా ఉండొచ్చు అని అంటున్నారు ట్రేడ్ పండితులు. వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం ప్రాంతాల వారీగా ఈ సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఏ రేంజ్ లో జరిగిందో ఒకసారి చూద్దాం. ఉత్తరాంధ్ర ప్రాంతం లో 12 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం, తూర్పు గోదావరి జిల్లాలో 7 కోట్ల 70 లక్షల రూపాయిలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 6 కోట్ల 70 లక్షలు, కృష్ణ జిల్లాలో 7 కోట్ల 20 లక్షలు, గుంటూరు జిల్లాలో 9 కోట్ల 60 లక్షలు, నెల్లూరు జిల్లాలో 4 కోట్ల 80 లక్షలు ఇలా ఓవరాల్ గా కోస్తాంధ్ర ప్రాంతం మొత్తం కలిపి 48 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు చెప్తున్నారు.
ఇక సీడెడ్ లో మాత్రం ఈ చిత్రానికి పాతిక కోట్ల రూపాయిల బిజినెస్ జరిగిందట. ఇది ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు గా చెప్తున్నారు. అలాగే నైజాం ప్రాంతం లో 41 కోట్ల రూపాయిలు, మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 114 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఎన్టీఆర్ రేంజ్ కి ఇది యావరేజ్ బిజినెస్ అని, అయినప్పటికీ టాక్ వస్తే మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. చూడాలి మరి విడుదల తర్వాత ఏమేరకు ఈ సినిమా బిజినెస్ చేస్తుంది అనేది.