https://oktelugu.com/

Nani: నేచురల్ స్టార్ నాని మరో క్రేజీ కాంబినేషన్..ఈసారి లెక్క ఎక్కడికి వెళ్లి ఆగుద్దో!

కొడితే కుంభస్థలం బద్దలు అవ్వాలి ఆనేలాగా ఆయన తన తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేసుకున్నాడు. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తో నాని తదుపరి సినిమా ఖరారు అయ్యింది. ఈ చిత్రం లో హీరోయిన్ మరెవరో కాదు, సాయి పల్లవి. నాని కి , శేఖర్ కమ్ముల కి, సాయి పల్లవి కి ముగ్గురుకి కూడా బలమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది.

Written By:
  • Vicky
  • , Updated On : September 12, 2024 / 06:08 PM IST

    Nani(2)

    Follow us on

    Nani: నేచురల్ స్టార్ నాని తన ప్రతీ సినిమాకి మార్కెట్ రేంజ్ ని పెంచుకుంటూ పోతున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా దగ్గర అవుతున్నాడు. మీడియం రేంజ్ హీరోలలో ఇప్పటికే మినిమం గ్యారంటీ హీరో అనే పేరు వచ్చేసింది. నాని సినిమా విడుదల అవుతుందంటే చాలు, ఆడియన్స్ లో పర్వాలేదు, చాలా బాగుంటుంది అనే నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం తోనే కేవలం ఆయన బ్రాండ్ ఇమేజి ద్వారా బిజినెస్ లు జరుగుతున్నాయి. ‘దసరా’ చిత్రం తో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి తన సత్తా ఏంటో చూపించిన నాని, ఆ తర్వాత ‘హాయ్ నాన్న’ చిత్రం తో మరో కూల్ హిట్ కొట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కి, మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు రీసెంట్ గా ‘సరిపోదా శనివారం’ చిత్రంతో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని మాస్ ఆడియన్స్ కి అత్యంత చేరువ అయ్యాడు. ఇప్పుడు ఆయన యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేసాడు.

    కొడితే కుంభస్థలం బద్దలు అవ్వాలి ఆనేలాగా ఆయన తన తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేసుకున్నాడు. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తో నాని తదుపరి సినిమా ఖరారు అయ్యింది. ఈ చిత్రం లో హీరోయిన్ మరెవరో కాదు, సాయి పల్లవి. నాని కి , శేఖర్ కమ్ముల కి, సాయి పల్లవి కి ముగ్గురుకి కూడా బలమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది. వీళ్ళ ముగ్గురు వేర్వేరుగా సినిమాలు చేస్తేనే బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తుంది, అలాంటిది ముగ్గురు కలిసి సినిమా చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే. నాని గతం లో సాయి పల్లవి తో ‘MCA’ మరియు ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి సూపర్ హిట్ సినిమాలు చేసాడు. వీళ్ళ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రమిది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల ధనుష్, నాగార్జున కాంబినేషన్ లో ‘కుభేరా’ అనే చిత్రం చేస్తున్నాడు.

    సాయి పల్లవి నాగ చైతన్య తో కలిసి ‘తండేల్’ వంటి భారీ బడ్జెట్ చిత్రం చేస్తుంది. నాని తన తదుపరి చిత్రం దసరా డైరెక్టర్ తో ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ ముగ్గురు తమ కమిట్మెంట్స్ ని పూర్తి చేయగానే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. సరైన కంటెంట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తే నైజాం లో 35 కోట్ల రూపాయిలు, నార్త్ అమెరికా లో 5 మిలియన్ డాలర్లు, ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకునే సినిమా ఇది. నాని ఈ చిత్రం తో స్టార్ హీరోల లీగ్ లోకి అధికారికంగా అడుగుపెట్టినట్టే అనుకోవచ్చు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది, రూరల్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కబోతుందట.