https://oktelugu.com/

Devara: దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరుకానున్న టాలీవుడ్ స్టార్ హీరో…

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హీరోలు వరుస సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ గా నిలుస్తున్నాయి...

Written By:
  • Gopi
  • , Updated On : September 12, 2024 / 06:01 PM IST

    Devara Trailer

    Follow us on

    Devara: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే మనందరికీ గుర్తొచ్చేది నందమూరి ఫ్యామిలీ… సినిమా ఇండస్ట్రీతో ఈ కుటుంబానికి విడదీయలేని బంధమైతే ఉంది. సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన చాలామంది హీరోలు తమకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను ఏర్పాటు చేసుకొని ముందుకు సాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ ఫ్యామిలీ బాధ్యతలను మోస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక తనదైన రీతిలో సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న ఆయన ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్ లో దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ వస్తుందనే నమ్మకంతో ఎన్టీయార్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే.

    అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తొందర్లోనే ఏర్పాటు చేయడానికి మేకర్స్ సన్నాహాలు అయితే చేస్తున్నారు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ తో పాటు ఇండియన్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ కూడా హాజరు అవ్వబోతున్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక కొరటాల శివ కి ప్రభాస్ కి మధ్య మంచి సన్నిహిత్యం ఉంది. ఇక కొరటాల శివని డైరెక్టర్ గా మార్చిందే ప్రభాస్…

    కాబట్టి ఈ సినిమా ఈవెంట్ కి తను వస్తే బాగుంటుందని కొరటాల భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ఎన్టీఆర్ కొరటాల ఇద్దరు కలిసి ప్రభాస్ ను ఆహ్వానించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రభాస్ కనక ఈ ఈవెంట్ కి వచ్చినట్లైతే ఈ సినిమా మీద మరింత బజ్ అయితే క్రియేట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇంకా ఇప్పటికే దేవర సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు సైతం భారీ ఆశలు పెట్టుకొని ఎదురుచూస్తున్నారు. ఇక బాలీవుడ్ లో ఎన్టీఆర్ ‘వార్ 2 ‘ అనే సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

    దేవర సినిమా తర్వాత వార్ 2 సినిమా మీదనే ఆయన ఎక్కువ ఫోకస్ చేసి తొందర్లోనే ఆ సినిమాని రిలీజ్ చేసే విధంగా ప్రణాళికలను రూపొందించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే వార్ 2 మూవీ కి సంభందించిన ఒక షెడ్యూల్లో పాల్గొన్న ఎన్టీఆర్.. తొందర్లోనే ఈ సినిమాను కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు…