NTR Best Dialogues: జూనియర్ ఎన్టీఆర్ డైలాగులు చెబుతూ ఉంటే, ప్రేక్షకులు విజిల్స్ తో ఊగిపోతూ ఉంటారు. అసలు సాధారణ మాట కూడా… తారక్ నోట మహా మంత్రం అవుతుంది. అందుకే.. ఎన్టీఆర్ డైలాగ్ లకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. మరి అలాంటి ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ 3 డైలాగ్స్ ఏమిటో చూద్దాం రండి.
డైలాగ్ 1 :
యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్యాన్సులు, నటన మాత్రమే కాదు డైలాగులు అదరగొడుతారు. అందుకోసమే దర్శకులు తారక్ కి తగిన మాటలు రాస్తారు. సాధారణ డైలాగులని సైతం అద్భుతంగా చెప్పే ఎన్టీఆర్.. పవర్ ఫుల్ డైలాగ్స్ ని మరింత ఎనర్జిటిక్ గా చెబుతారు. అలాంటి మరిచిపోలేని డైలాగ్స్ పై ఫోకస్…
ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట వైతరణి వరకు వెంటాడి, వేధించి ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రములను మంటగలిపి ప్రతి ప్రాణములను దక్కించుకున్న నారీమణి సావిత్రిది ఏ జాతి ? మానవ జాతి. తన భక్తి తో సాక్షాత్ పరమశివుడిని ప్రత్యక్షము గావించి మీ పాశముని సైతం గడ్డిపోచగా నెంచి ప్రాణహారులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి ? మానవ జాతి.
నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూటకట్టుకున్న మీరు.. నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా, ఎంత అవివేకం ?, ఎంత అజ్ఞానం ? ఎంత కుసంస్కారం ?. నేటినుంచి దేవుడదికుడు, నరుడధముడు అన్న కించ భావాన్ని కూకటివేళ్లతో సైతం పెకిలించి వేసెద. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు దిక్కులనేలే అష్ట దిక్పాలకులు మనుగదానిచే పంచభూతములు సైతం, జయహో నరుడా అని హర్షించే విధంగా ఈ సింహాసనాన్ని అధిష్టించెద.
స్వర్ణ మణిమయ రత్న చతలంకృతమైన ఈ సభ మందిరమున, అకుంఠిత సేవ దక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరవమున సర్వదా శతధా, శతధా సహస్రదా పాపా పంకిలమైన కుల, మాత, జాతి కూపములను సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళన గావించెద. ఎనీ డౌట్స్.
డైలాగ్ 2 :
రేయనక, పగలనక ఎండనక, వాననకా, వాగనక వరదనక, రాయనక రప్పనక, దుమ్మనక దుప్పనకా, ముళ్ళనక ముప్పనక, పురుగనక పామనక, కోడికూత కోయగానే నాగలెత్తి పొలం చేరి, సాలు పట్టి కొండ్రవేసి, దుక్కి దున్ని దుగాలేసి, నీరు పట్టి దమ్ము చేసి, విత్తునాటి పైరు పెంచి, పస్తులుండి పుస్తెలమ్మి, మందు జల్లి కలుపు తీసి, కాపు కాచి .. ముసలి ముతక అమ్మానాన్న పిల్ల జిల్లా ఇల్లంతా ఏకమై కోత కోసి, కుప్ప నూర్చి బస్తాకెత్తి బండి కట్టి పట్నం వచ్చి, మిల్లు కొచ్చి బేరమాడి, కాటకెత్తి.. పైకమంతా లెక్కకట్టి కళ్ళకద్ది కట్ట కట్టి, పక్క నెట్టి, అలసట ఇంత తీర్చాలని అర కప్పు టీ అడిగితే.. ఆరుగాలం రైతు బిడ్డ నెత్తురంతా చమట చేసి .. వెనక్కి వేసిన సొమ్ముని వెనక్కి తిరిగేలోగా కాజేసే నీకెంత దమ్ములిబే…
డైలాగ్ 3 :
ఆఫ్ట్రాల్ కాదు సార్, భారతదేశంలో రోజుకి ఒక కోటీ యాభై లక్షల మంది మా రైల్వే లో ప్రయాణిస్తున్నారు సార్. ఎనిమిది వేల స్టేషన్లు సార్. లక్ష ఏడువేల కిలోమీటర్ల ట్రాక్ సార్. భారతదేశంలో రైల్వే రెండు లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది సార్. ఆఫ్ట్రాల్ కాదు సార్, మొత్తం 64 డివిజన్లు సార్. 15 లక్షల మంది ఎంప్లాయిస్ సార్. ఒక్క మన సికింద్రాబాద్ డివిజన్లో 170 ట్రైన్లు, 600 గార్డులు, 1200 డ్రైవర్లు, ఆరువేలమంది గ్యాంగ్ మెన్లు పని చేస్తున్నారు సార్. ఆఫ్ట్రాల్ ఏంటి సార్, ఆపరేటింగ్ బ్రాంచ్, టెక్నీకల్ బ్రాంచ్, మెయింటెన్స్ బ్రాంచ్, ఐ ఓ డబ్ల్యూ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వంటి ఎన్నో బ్రాంచ్ ల్లో ఎన్నో లక్షల మంది ఎంప్లాయిలు డే అండ్ నైట్ కస్టపడి కోట్లమంది వారి గమ్యానికి సేఫ్ గా చేరుస్తున్నారు సార్. ఆఫ్ట్రాల్ కాదు సార్, సంవత్సరానికి మా రైల్వే డిపార్ట్మెంట్ మన గవర్నమెంట్ కి ఇస్తున్న ఆదాయం 56 వేల కోట్లు సార్. ఆఫ్ట్రాల్ కాదు సార్. ఒక్క నిమిషం మా రైల్వే ఆగిపోతే భారత దేశం స్తంభించి పోతుంది. ఎన్నో కోట్ల మంది జీవితాలు ఆగిపోతాయి. పార్లమెంట్ ఆగిపోతుంది. అసెంబ్లీ కదిలిపోతుంది. మీ సీటు ఎగిరిపోతుంది సార్. ఆఫ్ట్రాల్ కాదు సార్.
Also Read: Akhanda Unbreakable Record: అఖండ రికార్డుని బ్రేక్ చెయ్యలేకపోయినా #RRR
Recommended Videos