Dimple Hayathi: నట సింహం బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఈ సాంగ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ మీ కోసం. హాట్ బాంబ్ డింపుల్ హయాతి బాలయ్య బాబుతో ఘాటు స్టెప్స్ వేస్తోంది. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రస్తుతం ఈ పాటను షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్ కోసం ప్రత్యేకంగా సెట్స్ ని వేశారు. డింపుల్ హయాతి ‘ఖిలాడీ’లో రవితేజ సరసన హీరోయిన్ గా నటించింది. కానీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.
హీరోయిన్ కి తక్కువ, ఐటమ్ భామకు ఎక్కువ అని అమ్మడు నటనా చాతుర్యం పై చాలా విమర్శలు వచ్చాయి. మొత్తమ్మీద నటన విషయంలో తేలిపోయినా, తన హాట్ హాట్ అందాలతో కుర్రకారు మనసులను మాత్రం బాగానే దోచుకుంది. అందుకే, ఆమెకు ఐటమ్ సాంగ్స్ వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ క్రమంలో బాలయ్యతో సాంగ్ వచ్చింది. ఈ సాంగ్లోనూ తన అందచందాలతో ఆకట్టుకోవడానికి డింపుల్ హయాతి శతవిధాలా ప్రయత్నం చేస్తోంది.
Also Read: Akhanda Unbreakable Record: అఖండ రికార్డుని బ్రేక్ చెయ్యలేకపోయినా #RRR
ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. రాయలసీమలో నీటి సమస్య చుట్టూ కథ తిరుగుతుంది. బాలయ్య చాలా పవర్ ఫుల్ గా కనిపించబోతున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే బాలయ్య స్టైలిష్ మాసివ్ అవతార్ లో అదరగొట్టడంతో ఈ సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు.
ఏది ఏమైనా ‘అఖండ’ తర్వాత బాలయ్య రేంజ్ మారిపోయింది. అందుకే ఈ సినిమా బడ్జెట్ విషయంలో మరో 30 కోట్లు అదనంగా పెట్టడానికి ఉత్సాహంగా ఉన్నారు. నిజానికి ఏపీలో టికెట్ రేట్లును దారుణంగా తగ్గించినా, బాలయ్య వంద కోట్ల మార్క్ ను దాటాడు. కాబట్టి.. బాలయ్యకి కరెక్ట్ సినిమా పడితే, 150 కోట్లు వసూళ్లు చేసే స్టామినా ఉందని రుజువు అయ్యింది. అందుకే, బాలయ్య నిర్మాతలు తగ్గేదే లే అంటున్నారు.
ఇక ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. బాలయ్య తండ్రీకొడుకులుగా కనిపిస్తారు. రెండు పాత్రల మధ్య వేరియేషన్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన ‘బాలయ్య ఫస్ట్ లుక్’ అదిరిపోయింది. బ్లాక్ షర్ట్ లో లుంగీతో దర్శనమిచ్చిన బాలయ్య, బ్లాక్ కారు పక్క నుంచి అలా నడుచుకుంటూ వచ్చి సూపర్ అనిపించాడు.
Also Read:Sarkaru Vaari Paata Collections: సర్కారు వారి పాట సినిమా కలెక్షన్స్ ఇంతేనా..టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద ఫేక్
Recommended Videos