Jagan- Early Elections: జగన్ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారా?

Jagan- Early Elections: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. విమర్శల దాడి కొనసాగుతోంది. జగన్ ప్రతిపక్షాలపై ప్రతిపక్షాలు సీఎంపై దుమ్మెత్తి పోసుకుంటున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలాగైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో పార్టీలు తమ వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నాయి. ప్రత్యర్థి పార్టీలపై విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. సీఎం జగన్ కూడా ఇదే దిశగా అడుగులు వేస్తున్నారు. జిల్లాలను పర్యటిస్తూ తమ ప్రభుత్వ ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు నెలలుగా ముఖ్యమంత్రి కార్యక్రమాలు […]

Written By: Srinivas, Updated On : May 17, 2022 3:56 pm
Follow us on

Jagan- Early Elections: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. విమర్శల దాడి కొనసాగుతోంది. జగన్ ప్రతిపక్షాలపై ప్రతిపక్షాలు సీఎంపై దుమ్మెత్తి పోసుకుంటున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలాగైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో పార్టీలు తమ వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నాయి. ప్రత్యర్థి పార్టీలపై విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. సీఎం జగన్ కూడా ఇదే దిశగా అడుగులు వేస్తున్నారు. జిల్లాలను పర్యటిస్తూ తమ ప్రభుత్వ ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నట్లు తెలుస్తోంది.

CM Jagan

రెండు నెలలుగా ముఖ్యమంత్రి కార్యక్రమాలు పరిశీలిస్తే అర్థమైపోతోంది. జగన్ ఎన్నికల కోసమే అన్ని ప్రాంతాలను పర్యటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. తన నిజాయితీని గుర్తించాలని సూచిస్తున్నారు. చంద్రబాబు హయాంలో చేసిన పనులకు ఇప్పుడు తాము ఫలితం అనుభవిస్తున్నామని ప్రశ్నిస్తున్నారు. ఆయన చేసిన తప్పిదాలతో కష్టాలు పడాల్సి వస్తోంది. అందుకే ప్రజలు అన్ని గమనిస్తన్నారు.

Also Read: NTR Best Dialogues: ఎన్టీఆర్ సినీ కెరీర్ లోనే బెస్ట్ 3 డైలాగ్స్ ఇవే

చంద్రబాబు సొంత మీడియా ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాయి. దీంతో తాము ఏది చేసినా అందులో చెడును తీసుకుని మంచిని వదిలేస్తున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం బాబు ఎంతకైనా తెగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటే మంచిది. లేకపోతే పరిణామాలు మరోలా ఉండే ప్రమాదముందని కోరుతున్నారు.

CM Jagan

జనసేనాని పవన్ కల్యాణ్ పై కూడా సెటైర్లు వేశారు. చంద్రబాబు దత్త పుత్రుడని విమర్శలు జల్లు కురిపించారు. కౌలు రైతుల పేరుతో ఆయన చేస్తున్న యాత్రలు హాస్యాస్పదమన్నారు. దీంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఎవరి స్వార్థం కోసం వారు వెంపర్లాడుతున్నారు. అధికారమే ధ్యేయంగా కదులుతున్నారు.

రాజకీయ ప్రయోజనాల కన్నా ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని చెబుతున్నారు. ఎన్నికల కోసం ఎన్ని జిమ్మిక్కులు చేసినా చివరకు గెలిచేది నిజాయితీయేనని గుర్తు చేస్తున్నారు. సీఎం జగన్ ఎన్నికల కోసం జిల్లాలు తిరుగుతున్నారని తెలుస్తోది. ఇక ముందస్తుకు వెళతారనే ప్రచారం సాగుతోంది.

Also Read:Ravela Kishore: బీజేపీకి రావెల గుడ్ బై.. టీడీపీలో చేరేందుకు లైన్ క్టీయరేనా?

Tags