https://oktelugu.com/

Nani: 100 కోట్లు సాధించిన నాని సినిమాలు ఇవే…టైర్ వన్ హీరోగా ఎదగాలంటే నాని ఇదొక్కటి చేయాల్సిందే…

ప్రస్తుతం తమదైన రీతిలో హీరోలందరూ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళుతున్నారు. ఇక ఇలాంటి క్రమం లోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా మంచి విజయాలను సాధిస్తున్నాయి...

Written By:
  • Gopi
  • , Updated On : September 9, 2024 / 10:04 AM IST

    Nani(2)

    Follow us on

    Nani: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోగా తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న నాని వరుసగా తన సినిమాలతో 100 కోట్లకు పైన కలెక్షన్లను రాబడుతూ తనదైన రీతిలో గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఆయన చేసిన దసరా సినిమా 130 కోట్ల భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇక దాంతో మొదటిసారిగా 100 కోట్ల క్లబ్ లో చేరిన నాని తనదైన రీతిలో భారీ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న సినిమాతో కూడా 100 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టిన హీరోగా నిలిచాడు. ఇక ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ‘సరిపోదా శనివారం’ సినిమా ప్రేక్షకులందరిని అలరించడమే కాకుండా ఒక డీసెంట్ హిట్ గా నిలిచింది.

    ఇక ప్రస్తుతం ఈ సినిమా భారీ కలెక్షన్లు కొల్లగొట్టే దిశగా ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా 180 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి నాని కెరియర్ లోనే ఆల్ టైం హిట్ గా నిలిచింది. ఇక ఇప్పటికే బ్రేక్ ఈవెన్ గా మారిన ఈ సినిమా దాదాపు 200 కోట్లకు పైన కలెక్షన్లను వసూలు చేసి నాని కెరియర్ లో సరికొత్త రికార్డును కూడా క్రియేట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. నాని ఎంటైర్ కెరీర్ లో వరుసగా మూడు సినిమాలతో 100 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి మీడియం రేంజ్ హీరోలెవ్వరికీ సాధ్యం కాని రీతిలో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే నాని టైర్ వన్ హీరోగా మారడానికి చాలా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి.

    ఇక దానికి కారణం ఏంటి అంటే నాని ప్రస్తుతం మీడియం రేంజ్ దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. అలా కాకుండా ఎవరైనా ఒక స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తే ఆయనకు భారీ కలెక్షన్లు వస్తాయి ఆయన టైర్ వన్ హీరోగా మారే అవకాశాలైతే ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పొజిషన్ లో స్టార్ డైరెక్టర్లందరూ స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి బిజీగా ఉన్నారు. కాబట్టి నానితో సినిమా చేసే స్టార్ డైరెక్టర్లు ఎవరు లేరు.

    ఇక ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయిన నాని సరే ఒక స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తే మాత్రం ఆయన ఆ సినిమాతోనే టైర్ వన్ హీరోగా మారిపోతాడు. మరి నానితో సినిమా చేసే స్టార్ డైరెక్టర్ ఎవరు అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే నాని టైర్ వన్ హీరోగా ఎదగాలి అని టార్గెట్ పెట్టుకోకుండా తనకొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. కాబట్టి నాని లాంటి స్టార్ హీరో ఇప్పుడు ఇండస్ట్రీలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు…