https://oktelugu.com/

Nandamuri Family : ఎన్టీయార్, కళ్యాణ్ రామ్ విషయాల్లో బాలయ్య జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదా..?

తెలుగు సినిమా ఉన్నంతకాలం గుర్తుండిపోయే పేర్లలో నందమూరి తారక రామారావు ఒకరు. ఆయన చేసిన సేవలు ఇండస్ట్రీకి మరెవరు చేయలేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఈయన ఒక వైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు ఇతర ఇండస్ట్రీల నుంచి వచ్చే పోటీనే తట్టుకొని నిలబడ్డాడు...

Written By:
  • Gopi
  • , Updated On : October 9, 2024 / 02:24 PM IST

    Nandamuri Family

    Follow us on

    Nandamuri Family :  నందమూరి తారక రామారావు తెలుగు సినిమా స్థాయిని పెంచిన నటుడు ప్రస్తుతం ఆయన మన మధ్యన లేకపోయినా కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా తమను తాము స్టార్లుగా ఎలివేట్ చేసుకుంటున్నారు. నిజానికి ఎన్టీఆర్ కొడుకు అయిన బాలయ్య బాబు తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఆయన చేసిన ప్రతి సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతూ ఉంటాడు. ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు చేస్తున్న ప్రతి సినిమా ఏదో ఒక రకమైన కొత్తదనంతో నిండిపోయి ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ గత కొన్ని రోజుల నుంచి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో నందమూరి బాలయ్య బాబుకి మాటలు లేవు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇంక రీసరిగా దేవర సినిమా సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ హరి అనే వ్యక్తి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ని బతికిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు.

    కాబట్టి తన మీద నాకు చాలా బాగా రెస్పెక్ట్ ఉందని ఎన్టీయార్ తెలియజేశాడు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇప్పుడు కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారు. ఎన్టీఆర్ హీరోగా చేస్తుంటే కళ్యాణ్ రామ్ ఆయన సినిమాకు ప్రొడ్యూస్ చేస్తూ తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటున్నాడు.

    ఇక ఏది ఏమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా చేసిన వాక్యాలు బాలయ్య బాబును ఉద్దేశించే చేశాడు అంటూ కొంతమంది బాలయ్య కి సపోర్ట్ గా మాట్లాడుతుంటే, మరి కొంత మంది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కి సపోర్టుగా ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ మాట అనలేదు.

    కేవలం ఎన్టీఆర్ ఆర్ట్స్ ని దగ్గరుండి చూసుకుంటున్న హరి గారికి తన కృతజ్ఞతలు తెలియజేస్తూనే,ఆయన వల్లే ఎన్టీఆర్ ఆర్ట్స్ అనేది నిలబడింది అంటూ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లైతే చేశాడు. నిజానికి ఇందులో తప్పైతే ఏమీ లేదు కానీ కొంతమంది బాలయ్య బాబుని ఉద్దేశించి ఇలాంటి మాటలు మాట్లాడాడు అంటూ వాళ్ళిద్దరి మధ్య వైరాన్ని పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలు చేయాలంటే మాత్రం అది బాలయ్య వల్ల మాత్రమే అవుతుందని స్పష్టంగా తెలుస్తుంది…