Vijayasai Reddy : ఏపీలో ఈవీఎం ట్యాంపరింగ్ పై మరో బాంబు పేల్చిన విజయసాయిరెడ్డి.. తిరుమల లడ్డూ ఇష్యూతో సంచలన ఆరోపణలు

మొన్న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి కూటమి ఘనవిజయం సాధించింది.164 సీట్లతో రికార్డు సృష్టించింది.వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన వైసీపీకి అతి తక్కువ స్థానాలు లభించాయి.దీంతో ఆ పార్టీ ఈవీఎంలపై అనుమానాలు మొదలుపెట్టింది.

Written By: Dharma, Updated On : October 9, 2024 2:19 pm

Vijayasai Reddy

Follow us on

Vijayasai Reddy : ఎన్నికలు ఫలితాలు వచ్చిన ప్రతిసారి ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం అనేది చర్చకు దారితీస్తోంది.దారుణ పరాజయం ఎదురైన వారు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారు.మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపైనే పెద్ద ఎత్తున అనుమానాలు నడిచాయి.ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఏకపక్షంగా గెలిచేసరికి ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం తెరపైకి వచ్చింది.తాజాగా జమ్మూ కాశ్మీర్,హర్యానాఫలితాలు వచ్చేసరికి మరోసారి ఈవీఎంల అంశంహాట్ టాపిక్ అయింది.కాంగ్రెస్ పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.దేశవ్యాప్తంగా చర్చకు కారణమవుతోంది.మళ్లీ బ్యాలెట్ వ్యవస్థను ప్రవేశ పెట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది.హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. పోస్టల్ బ్యాలెట్ లో సునామీ సృష్టించిన ఆ పార్టీ ఈవీఎంలను తెరిచేసరికి కుప్పకూలింది.ఈవీఎంల కౌంటింగ్ ఆరంభమైన తర్వాత బిజెపి హవా ప్రారంభం అయింది. సాధారణంగా పోస్టల్ బ్యాలెట్ మొదట లెక్కిస్తారు.అయితే తొలి గంటలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించింది.71 నియోజకవర్గాల్లో ఆధిక్యత కొనసాగింది.అయితే ఎప్పుడైతే ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం అయ్యిందో.. అప్పటినుంచి బిజెపి దూసుకెళ్లింది. ఇప్పుడు అదే అనుమానాలకు కారణమవుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలకు అదే కారణం. తొలుత 71 అసెంబ్లీ సీట్లలో అధిక్యతతో ఉన్న కాంగ్రెస్ పార్టీ 37 స్థానాలతో సరిపెట్టుకుంది. బిజెపి మాత్రం 48 సీట్లు సాధించి హర్యానాలో హ్యాట్రిక్ కొట్టింది. ఈ పరిణామాలను కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది.

* ప్రజల దృష్టి మరల్చేందుకే
అయితే తాజాగా ఈవీఎంల పనితీరుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని అనుమానం వచ్చేలా మాట్లాడారు. ఏపీలో ఎన్నికలు జరిగి మూడు నెలల తర్వాత ఎలక్షన్ కమిషన్ ఫామ్ 20ని వెబ్ సైట్ లో పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.అయితే దీనిపై కోర్టుకు వెళ్లకుండాటిడిపి కూటమి తిరుమల లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చిందని సంచలన ఆరోపణలు చేశారు విజయసాయిరెడ్డి. వాళ్ల కుట్రలో భాగంగా పక్కా స్కెచ్ తో దీనిని అమలు చేశారని విమర్శించారు. చంద్రబాబుకు నిజా నిజాలతో ఎలాంటి పనిలేదని.. తిరుమలలో వివాదం భగవంతుడి కోసం కాదని.. ఈవీఎంల టెంపరింగ్ బయటపడకుండా చేసిన పన్నాగం గా చెప్పుకొచ్చారు.

* చంద్రబాబు వచ్చిన తరువాతే
తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని ఆరోపణలు చేశారని.. కానీ చంద్రబాబు గుజరాత్ వెళ్లి వచ్చిన తరువాత.. అక్కడి ఎన్డిడిబి ల్యాబ్ నివేదిక వచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. టీటీడీకి ఉద్దేశపూర్వకంగానే కొత్త పాలకమండలి వేయని విషయాన్ని కూడా ప్రస్తావించారు. ప్రజలు ఈసీ తన అధికార వెబ్సైట్లో పొందుపరిచిన ఏపీ ఎన్నికల ఫామ్ 20ని పట్టించుకోకుండా ఉండేందుకే ఈ లడ్డు వివాదాన్ని సృష్టించారని ఆరోపణలు చేశారు విజయసాయి. మొత్తానికైతే కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. విజయసాయిరెడ్డి తెరపైకి రావడం విశేషం.