https://oktelugu.com/

Devara Movie In OTT : పండుగ రోజు ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘దేవర’..మేకర్స్ ఇచ్చిన ట్విస్ట్ కి ఫ్యాన్స్ షాక్!

అక్టోబర్ 13 వరకు సెలవులు ఉండడంతో అప్పటి వరకు ఈ చిత్రానికి మంచి వసూళ్లు వస్తూనే ఉంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. కల్కి తర్వాత భారీ గ్యాప్ తో విడుదల అయిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం కావడంతో ఈ సినిమాకి ఈ స్థాయి థియేట్రికల్ రన్ దక్కిందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 9, 2024 / 02:26 PM IST

    Devara Movie In OTT

    Follow us on

    Devara Movie In OTT :  ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలై ఓపెనింగ్స్ నుండి లాంగ్ రన్ వరకు దంచి కొడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈమధ్య కాలం లో పెద్ద హీరో సినిమాకి ఈ స్థాయి లాంగ్ రన్ రావడం చూడలేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. ‘దసరా’ కి ముందు విడుదలయ్యే సినిమాలకు టాలీవుడ్ లో మంచి థియేట్రికల్ రన్ ఉంటుందని ట్రేడ్ పండితులు అంటూ ఉంటారు. ‘దేవర’ విషయంలో అది మరోసారి నిజమైంది. మొదటి వీకెండ్ తర్వాత ఈ సినిమా కాస్త నెమ్మదించినప్పటికీ, అక్టోబర్ 3 వ తారీఖు నుండి స్కూల్స్ మరియు కాలేజీలకు దసరా సెలవలు ఇవ్వడంతో సెకండ్ వీకెండ్ కళ్ళు చెదిరే ఆక్యుపెన్సీలు రాబట్టింది. గ్రాస్ వసూళ్లు అయితే ఊహకందని రేంజ్ లో వచ్చాయి.

    అక్టోబర్ 13 వరకు సెలవులు ఉండడంతో అప్పటి వరకు ఈ చిత్రానికి మంచి వసూళ్లు వస్తూనే ఉంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. కల్కి తర్వాత భారీ గ్యాప్ తో విడుదల అయిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం కావడంతో ఈ సినిమాకి ఈ స్థాయి థియేట్రికల్ రన్ దక్కిందని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 370 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ తో 400 కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరబోతోంది ఈ చిత్రం. రాజమౌళి సహాయం లేకుండా, ప్రభాస్ తర్వాత ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన ఏకైక టాలీవుడ్ హీరో గా ఎన్టీఆర్ ‘దేవర’ తో నిలిచాడు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి భారీ రేట్ కి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సుమారుగా 140 కోట్ల రూపాయిల డీల్ ని కుదిరించుకున్నారు మేకర్స్. అయితే ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని 50 రోజుల తర్వాతనే ఓటీటీ లో విడుదల చేయాలి. ‘దేవర’ చిత్రం సరిగ్గా 50 రోజులు పూర్తి అయిన తర్వాత దీపావళి పండుగ వస్తుంది.

    దీపావళి రోజు నుండి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి వస్తుందని సమాచారం. అయితే ఈ విషయం థియేట్రికల్ రన్ నడుస్తున్న సమయంలోనే లీక్ అవ్వడంతో అభిమానులు కాస్త నిరాశకు గురి అయ్యారు. ఇలా ముందే ఓటీటీ విడుదల తేదీ చెప్పేస్తే థియేట్రికల్ రన్ మీద ప్రభావం చూపిస్తుందని, ఇలాంటి పొరపాట్లు చెయ్యొద్దు అంటూ మేకర్స్ ని ట్యాగ్ చేసి కోరుకుంటున్నారు ఫ్యాన్స్. ఇదంతా పక్కన పెడితే వాస్తవానికి ఈ సినిమా 3 గంటల 12 నిమిషాలు ఉంటుంది. నిడివి బాగా ఎక్కువ ఉండడంతో ఎడిటింగ్ లో చాలా సన్నివేశాలు తీసేసారు. ఓటీటీ వెర్షన్ లో ఆ సన్నివేశాలను జత చేసి విడుదల చేస్తారని తెలుస్తుంది. ఈమధ్య కొన్ని సినిమాలు ఇదే పద్దతిని అనుసరిస్తున్నాయి, ఇప్పుడు ఆ కోవలోకి దేవర కూడా చేరిపోయింది.