Allu Family VS Megha family : గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో మెగా మరియు అల్లు ఫ్యామిలీ అభిమానుల మధ్య ఏ స్థాయిలో ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఇన్ని రోజులు మొత్తం ఒకే కుటుంబంలాగా కలిసి ఉన్న ఈ రెండు కుటుంబాలు, ఇప్పుడు విడివిడిగా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ క్రమంలో ఎన్నో అంశాలు చర్చలోకి వచ్చాయి. అందులో కొంతమంది మెగా ఫ్యామిలీ లేకపోతే అల్లు కుటుంబం లేదని, అలాగే మరికొంతమంది అల్లు ఫ్యామిలీ లేకపోతే అసలు మెగా ఫ్యామిలీ లేదని పరస్పరం కామెంట్స్ చేస్కుంటూ ఉన్నారు. అసలు ఇందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో చూద్దాం. 1980 వ సంవత్సరంలో అల్లు రామలింగయ్య తన కూతురు సురేఖ ని చిరంజీవి కి ఇచ్చి పెళ్లి చేసాడు. చిరంజీవి అప్పటికి ఇండస్ట్రీ కి వచ్చి రెండేళ్లు అయ్యింది.
1978 వ సంవత్సరంలో ఆయన ‘పునాదిరాళ్లు’ అనే చిత్రం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. తొలుత క్యారక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేస్తూ వచ్చిన చిరంజీవి, ఆ తర్వాత ఆయనలోని చురుకుదనం ని గుర్తించిన దర్శక నిర్మాతలు ఆయనకి హీరో అవకాశాలు ఇచ్చారు. ఆరోజుల్లోనే ఆయన డ్యాన్స్, ఫైట్స్, యాక్టింగ్ ని చూసి ప్రేక్షకులు ఊగిపోయారు. చిరంజీవి కి అవకాశాల వెల్లువ కురిసింది. అలా ఆయన ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రెండేళ్లలోపే స్టార్ హీరో దిశగా అడుగులు వేస్తూ ముందుకు పోతున్నాడు. ఇది గమనించిన అల్లు రామలింగయ్య కుమారుడు అల్లు అరవింద్, ఇతను భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతాడని, ఇలాంటోడికి మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె జీవితం సుఖంగా ఉంటుందని, చిరంజీవి తో పాటు మన కుటుంబం కూడా ఎదుగుతుందని చెప్పడంతో అల్లు రామలింగయ్య కొన్నాళ్ళు చిరంజీవిని బాగా దగ్గర నుండి పరిశీలించి, ఆ తర్వాత తన కూతురుకి ఇచ్చి పెళ్లి చేసాడు. పెళ్ళైన తర్వాత అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ ని స్థాపించి చిరంజీవి తో 40 కి పైగా సినిమాలు తీసి ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకున్నాడు. ఆ సినిమాలు చిరంజీవి కి ఎంత ఉపయోగపడ్డాయో, గీత ఆర్ట్స్ కి కూడా అంతే ఉపయోగపడ్డాయి. తనతో సినిమాలు తీసేందుకు టాప్ నిర్మాతలు క్యూలు కడుతున్నప్పటికీ కూడా చిరంజీవి తన బావమరిదికే అవకాశాలు ఇస్తూ వచ్చాడు.
అలా చిరంజీవి కారణంగా మాత్రమే అల్లు ఫ్యామిలీ నేడు ఈ స్థానంలో ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా అని అల్లు ఫ్యామిలీ ని తీసి పారేయాల్సిన అవసరం కూడా లేదు. పవన్ కళ్యాణ్ ని పరిచయం చేసింది, రామ్ చరణ్ కి మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ ని ఇచ్చి స్టార్ హీరోని చేసింది అల్లు అరవింద్ మాత్రమే . ఆరోజుల్లో 40 కోట్ల బడ్జెట్ ని పెట్టి మగధీర లాంటి సినిమాని తీసే సాహసం ఉన్న నిర్మాత ఎవరున్నారు చెప్పండి?, అలా చెయ్యబట్టే కదా ఆ సినిమా అంత పెద్ద హిట్ అయ్యింది, రామ్ చరణ్ సులువుగా స్టార్ హీరో అయ్యాడు. కాబట్టి రెండు ఫ్యామిలీలు ఒకరికి ఒకరు ఉపయోగపడ్డారు, ఇది గమనించి అభిమానులు సోషల్ మీడియా లో ఫ్యాన్ వార్స్ ఆపడం మంచిది అంటూ సీనియర్ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.