https://oktelugu.com/

Krithi shetty VS Sreeleeela : నా సినిమాలు ఫ్లాప్ అయితే ఆ హీరోయిన్ సంబరాలు చేసుకుంది అంటూ కృతి శెట్టి షాకింగ్ కామెంట్స్!

ఈమెకి ఫ్లాప్స్ వస్తున్న సమయంలోనే శ్రీలీల ఇండస్ట్రీ లోకి కొత్తగా రావడం. కృతి శెట్టి కంటే ఆమె బెటర్ ఛాయస్ గా దర్శక నిర్మాతలకు అనిపించడంతో ఆమెకి అవకాశాలు క్యూ కట్టాయి, కృతి శెట్టి కి అవకాశాలు తగ్గిపోయాయి.

Written By: , Updated On : August 29, 2024 / 10:03 PM IST
Krithi shetty vs Sreeleeela

Krithi shetty vs Sreeleeela

Follow us on

Krithi shetty VS Sreeleeela : కొత్తగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరోయిన్స్ లో అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న వారిలో ఒకరు కృతి శెట్టి. ఉప్పెన చిత్రం తో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈమె తొలి సినిమాతోనే భారీ హిట్ ని అందుకొని యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ ఊపులో ఆమెకి వరుసగా సినిమా ఆఫర్లు వెల్లువలాగా వచ్చాయి. ఇలాంటి సమయంలోనే అడుగులు ఆచితూచి వెయ్యాల్సి ఉంటుంది. కానీ కృతి శెట్టి తొందరపడింది. తన చేతికి వచ్చిన ప్రతీ ఆఫర్ ని కాదు అనకుండా ఒప్పుకొని చేసింది. ఫలితంగా ఆమె ఎంత తొందరగా స్టార్ లీగ్ లోకి అడుగుపెట్టిందో, అంతే తొందరగా క్రిందకు పడిపోయింది. ఉప్పెన తర్వాత ఈమె చేసిన ‘శ్యామ్ సింగ రాయ్’, ‘బంగార్రాజు’ చిత్రాలు సూపర్ హిట్స్ అవ్వగా, ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి.

ఈమెకి ఫ్లాప్స్ వస్తున్న సమయంలోనే శ్రీలీల ఇండస్ట్రీ లోకి కొత్తగా రావడం. కృతి శెట్టి కంటే ఆమె బెటర్ ఛాయస్ గా దర్శక నిర్మాతలకు అనిపించడంతో ఆమెకి అవకాశాలు క్యూ కట్టాయి, కృతి శెట్టి కి అవకాశాలు తగ్గిపోయాయి. పాపం ఇప్పుడు ఈ బ్యూటీ కి కుర్ర హీరోలు కూడా అవకాశాలు ఇవ్వడం లేదు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో, ఆమె చేసిన కొన్ని హాట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఆమె మాట్లాడుతూ ‘ఉప్పెన చిత్రం సూపర్ హిట్ అవ్వగానే, నాకు టాలీవుడ్ వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆ సమయంలో ఒక హీరోయిన్ నాకు ఫ్లాప్స్ రావాలని కోరుకుంది. నా సినిమా ఫ్లాప్ అవ్వగానే ఆమె సంబరాలు చేసుకుంది.కానీ అలాంటి వాళ్లంతా నాకు ఒక్క ఫ్లాప్ రాగానే కృంగిపోతారని అనుకున్నారు, కానీ అది జరగలేదు. నేను హిట్ వచ్చినప్పుడు పొంగిపోలేదు, ఫ్లాప్ వచ్చినప్పుడు డీలా పడలేదు. హిట్, ఫ్లాప్ ని నేను సమానంగా చూసాను. ఇంకా హిట్స్ వచ్చినప్పటి కంటే ఫ్లాప్స్ వచ్చినప్పుడే నేను ఎక్కువగా నేర్చుకున్నాను . నా తప్పులు తెలుసుకున్నాను, ఒక నటిగా ఎలా సక్సెస్ అవ్వాలో నేర్చుకున్నాను. ఎదో ఒకరోజు సక్సెస్ అయ్యి చూపిస్తాను’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా కృతి శెట్టి చివరగా మన తెలుగు ఆడియన్స్ కి కనిపించిన చిత్రం ‘మనమే’. శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా భారీ ఫ్లాప్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత ఆమె తమిళం లో ప్రదీప్ రంగనాథన్ తో ‘LIC’ అనే సినిమా చేస్తుంది. టైం ట్రావెల్ నేపథ్యం లో సాగే ఈ లవ్ స్టోరీ తో కృతి శెట్టి కం బ్యాక్ ఇస్తుందని ఆమె అభిమానులు బలంగా నమ్ముతున్నారు.