The Vijay Tag: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో సినిమాలను చేస్తు ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. యంగ్ స్టార్ కి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు అవకాశాలైతే వస్తున్నాయి. ప్రస్తుతం స్టార్ హీరోలందరు భారీ సినిమాలను చేయడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడంలో కీలకపాత్ర వహిస్తున్నాడనే చెప్పాలి…రేసింగ్ గా ఆయన చేస్తున్న కింగ్ డమ్ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తు ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియోకి ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది…ఇక రీసెంట్ గా ఇంగ్లీష్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన విజయ్ దేవరకొండ తనకి ఇచ్చిన ‘ది’ (The) అనే ట్యాగ్ మీద భారీ విమర్శలను ఎదుర్కొన్నాను అంటూ ఆయన స్పష్టం చేయడం విశేషం… అయితే తనకంటే ముందున్న హీరోలకు ఒక ట్యాగ్ అనేది ఉంది. తన తర్వాత వచ్చిన వాళ్లకు కూడా ట్యాగ్ అనేది ఉంది కానీ తనకు మాత్రం ఇలాంటి ట్యాగ్ లేకపోవడంతో చాలామంది సెన్సేషనల్ స్టార్, రౌడీ స్టార్ అని పిలవడం స్టార్ట్ చేశారు.అది తనకు నచ్చలేదట దాంతో లైగర్ (Liger) మూవీ టీం దానిని గమనించి తనకు ది విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అనే ట్యాగ్ ని ఆడ్ చేయడంతో చాలామంది చాలా రకాల విమర్శలను చేశారని ఒక రకంగా ఆయన దాని వల్ల కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొన్నారనే చెప్పాలి.
Also Read: వామ్మో ఈ సీరియల్ బ్యూటీ అందం మామూలుగా లేదు గా..
దాన్ని ఆడ్ చేయడం పట్ల తనకు కూడా ప్రస్తుతం విజయ్ దేవరకొండ అని పిలిస్తే చాలని ముందు వెనకాల ఎలాంటి ట్యాగ్ లు అంటించాల్సిన అవసరం లేదని చెప్పానని, మరి ఏది ఏమైనా కూడా విజయ్ దేవరకొండ ఇప్పుడు కింగ్ డమ్ (Kingdom) సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
మరి ఈ సినిమా తర్వాత తన లెక్కలు మొత్తం మారిపోబోతున్నట్లుగా తెలుస్తున్నాయి.ఇక ఈ సినిమాను పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించడానికి సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతుందనే విషయాన్ని తెలియజేసిన మేకర్స్ మొదటి పార్ట్ ని ఈనెల 31వ తేదీన ప్రేక్షకులను ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
BIG STATEMENT FROM #VijayDeverakonda
“I wasn’t in a position to tell the director that I wasn’t ready with the script, as I don’t have any backing or industry background”
pic.twitter.com/b6d8vnLXyg— Vedi..VediGa… (@vedivediga) July 8, 2025
ఇక ఏది ఏమైనా కూడా మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకుంటే మాత్రం పాన్ ఇండియాలో తనను మించిన స్టార్ హీరో మరొకరు ఉండరు అనేది స్పష్టం అవుతోంది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…