https://oktelugu.com/

Mohan Babu : మోహన్ బాబు కేసు లో సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు..పోలీసులకు కీలక ఆదేశాలు జారీ!

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు రిపోర్టర్ పై దాడి చేసిన కేసు లో హై కోర్టు ముందస్తు బెయిల్ ని నిరాకరించడంతో, మోహన్ బాబు సుప్రీమ్ కోర్టు ని ఆశ్రయించాడు.

Written By:
  • Vicky
  • , Updated On : January 9, 2025 / 02:08 PM IST

    Mohan Babu

    Follow us on

    Mohan Babu : ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు రిపోర్టర్ పై దాడి చేసిన కేసు లో హై కోర్టు ముందస్తు బెయిల్ ని నిరాకరించడంతో, మోహన్ బాబు సుప్రీమ్ కోర్టు ని ఆశ్రయించాడు. నేడు ఈ కేసు ని విచారించిన సుప్రీమ్ కోర్టు తదుపరి విచారణ వరకు మోహన్ బాబు పై ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత విచారణ ని నాలుగు వారాలకు వాయిదా వేసింది. నేడు జరిగిన విచారణ లో వాదనలు ఎలా ఉన్నాయంటే మోహన్ బాబు తరుపున న్యాయవాడి మాట్లాడుతూ ‘క్షణికావేశంతో జర్నలిస్టు పై దాడి చేసిన తర్వాత మోహన్ బాబు బహిరంగంగా క్షమాపణలు తెలియచేసాడు’ అంటూ జడ్జి కి తన వాదనని వినిపించాడు. కుటుంబ వివాదాలను కెమెరాలతో షూట్ చేసేందుకు మీడియా రిపోర్టర్స్ నేరుగా లోపలకు వచ్చేశారని, ఆ మూమెంట్ లో ఇది జరిగిపోయిందని న్యాయవాది చెప్పుకొచ్చాడు.

    దీనికి సుప్రీమ్ కోర్టు స్పందిస్తూ ‘ఇంట్లోకి వఛిన్నంత మాత్రానా రిపోర్టర్స్ పై అమానుషంగా దాడి చేస్తారా?’ అని ప్రశ్నించింది. తుది తీర్పు ఏమి రాబోతుందో మరో నెల రోజుల్లో తెలియనుంది. హైకోర్టు మోహన్ బాబు ముందస్తు బెయిల్ ని రద్దు చేయడంతో హైదరాబాద్ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్ లో విచారించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోగా, ఇప్పుడు సుప్రీమ్ కోర్ట్ నుండి ఎలాంటి చర్యలు తీసుకోరాదని తీర్పు రావడంతో మోహన్ బాబు కి ఉపశమనం లభించింది. గత నెలలో మంచు కుటుంబాల మధ్య వివాదాలు ఏ రేంజ్ లో జరిగాయో మనమంతా కళ్లారా చూసాము. మంచు మనోజ్ మోహన్ బాబు ఇంటి గేట్స్ ని బద్దలు కొట్టుకొని లోపలకి దూసుకొని పోవడం యాక్షన్ సినిమాని తలపించింది. బిగ్ బాస్ రియాలిటీ షో చూసేవారికి మరో బిగ్ బాస్ రియాలిటీ షో చూస్తున్నట్టుగా కూడా అనిపించింది.

    గుట్టుగా నాలుగు గోడల మధ్య పరిష్కారం జరుపుకోవాల్సిన విషయాలను రోడ్డు మీదకి తీసుకొచ్చి మాకు ఇవేమి టార్చర్ రా బాబు అని జనాలు తల బాదుకునే పరిస్థితి ఏర్పడింది. మోహన్ బాబు మనోజ్ పై ఆరోపణలు చేస్తూ ఒక ఆడియో విడుదుల చేయడం, అదే విధంగా మనోజ్ తల్లి కూడా మనోజ్ కి వ్యతిరేకంగా లేఖ రాయడం, ఇవన్నీ చూస్తుంటే పాపం అందరూ కలిసి మనోజ్ ని ఒంటరి వాడిని చేసేశారని భావన నెటిజెన్స్ లో కలిగింది. అయితే కొద్దిరోజుల క్రితమే విష్ణు మనోజ్ ఇంటిలోని జనరేటర్ లో షుగర్ పోయడం, దాని వల్ల పవర్ కట్ అవ్వడం, మనోజ్ మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం వంటివి జరిగాయి. ఇవి చూసేవాళ్లకు చాలా ఫన్నీ గా అనిపించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ కేసు వ్యవహారం తెరమీదకు రావడంతో మంచు కుటుంబ వివాదాలను జనాలు మర్చిపోయారు.