Lambasingi: చలికాలంలో మాత్రమే లంబసింగి(Lamba singi)లో పర్యాటకులు(tourists) విస్తృతంగా సందడి చేస్తారు. ఈ ప్రాంతంలో కొండలు విస్తారంగా ఉంటాయి. కాఫీ తోటలు(coffee estates).. ఏపుగా పెరిగిన వృక్షాలు.. కనుల విందును కలిగిస్తాయి. అందువల్లే పర్యాటకులు ఈ ప్రాంతానికి ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ లభించే కాఫీ బాగుంటుంది. పర్యాటకుల కోసం ఇక్కడ చికెన్ చీకులు(roasted chicken), మటన్ చీకులు(roasted mutton) అమ్ముతుంటారు. బొగ్గుల మీద వీటిని కాల్చడం వల్ల రుచి కూడా చాలా బాగుంటుంది. ఇక బొంగులో చికెన్ బిర్యాని కూడా ఇక్కడ ప్రత్యేకంగా లభిస్తుంది. ఉదయాన్నే ఐదు గంటలకల్లా లంబసింగి ప్రాంతానికి వెళ్లి.. తెరలు తెరలుగా కురుస్తున్న మంచును.. ఆ మంచు మబ్బులను తాకుతున్న దృశ్యాలను చూడటం సరికొత్త అనుభూతి. వీటిని చూడడం కోసమే పర్యాటకులు ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు. పర్యాటకుల కోసం ఆంధ్ర ప్రదేశ్ టూరిజం విభాగం కూడా ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పిస్తోంది. ఇక్కడ గుడారాలను కూడా నిర్మించింది. పర్యాటకులు గుడారాలలో సేద తీరి.. ఆ తర్వాత ఉదయాన్నే లంబసింగి ప్రాంతానికి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ కొండలను ఎక్కడం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది.
అందువల్లే ఈ ఉష్ణోగ్రతలు
లంబసింగి ప్రాంతం పూర్తిగా గిరిజన ప్రాంతం. ఇది సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది మన్యం ప్రాంతంలో ఉంటుంది. సహజంగా మన్యం ప్రాంతంలో వేసవి మినహా మిగతా కాలంలో తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఇక లంబసింగి ప్రాంతంలో ఉష్ణోగ్రత ఇంకా తక్కువగా నమోదవుతుంది. ఈ ప్రాంతం పూర్తిగా కొండల మధ్యలో ఉంటుంది. రెండు కొండల మధ్య ఒక దారి లాంటి ప్రాంతంలోనే లంబసింగి గ్రామం ఉంటుంది. ఈ కొండపై నుంచి శీతల గాలులు వస్తుంటాయి. ఆ కొండపై నుంచి వచ్చే శీతల గాలులకు ఎటువంటి ఆటంకం ఉండదు. అక్కడ మేఘాలు ఏర్పడేందుకు అవకాశం ఉండదు. రెండు కొండల మధ్య ఉన్న దారిలో శీతల గాలులు వస్తుంటాయి. అవి మేఘాలను పక్కకు నెట్టేస్తుంటాయి. అందువల్లే అక్కడ శీతాకాలంలో 0 సెంటిగ్రేట్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. అయితే ఈ వాతావరణాన్ని పర్యాటకులు అమితంగా ఇష్టపడుతుంటారు. కార్పొరేట్ జంగిల్స్ లో కూరుకుపోయిన వారంతా లంబసింగి ప్రాంతానికి వచ్చిన తర్వాత సరికొత్త అనుభూతిని సొంతం చేసుకుంటారు. ఇక్కడ శీతల గాలులు పర్యటకులకు హిమాలయాలలో ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. ఇక్కడ లభించే వంటకాలు కూడా సరికొత్తగా ఉంటాయి. ఇక్కడి కాఫీ పొడి జియోగ్రాఫికల్ ఇండెక్స్ కూడా సొంతం చేసుకుంది. విశాఖ ఐటీడీఏ ఈ కాఫీని గ్లోబల్ గా ప్రమోట్ చేయడానికి కొంతకాలంగా ప్రయత్నించింది. ఆ తర్వాత విజయం సాధించింది. ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టే లంబసింగి అనేది దక్షిణాది హిమాలయ ప్రాంతంగా పేరు పొందింది.