Tamannaah Bhatia
Tamannaah Bhatia: పరిశ్రమలో ఎఫైర్స్ చాలా కామన్. అయితే ప్రచారమయ్యే ప్రతి వార్తలో నిజం ఉండకపోవచ్చు. వరుసగా ఓ హీరో, హీరోయిన్ రెండు సినిమాలు చేస్తే చాలు అనుమానాలు మొదలైపోతాయి. సెట్స్ లో కొంచెం సన్నిహితంగా ఉంటే సంథింగ్ సంథింగ్ అని వార్తలు రాసేస్తారు. గతంలో తమన్నా మీద ఇలాంటి పుకారు ఒకటి చక్కర్లు కొట్టింది. 2011లో తమన్నా-అల్లు అర్జున్ కాంబోలో బద్రినాథ్ తెరక్కింది. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే అల్లు అర్జున్ పెళ్లి చేసుకున్నారు. 2011 మార్చిలో స్నేహారెడ్డితో వివాహం కాగా… జూన్ నెలలో బద్రినాథ్ విడుదలైంది.
ఆ మూవీ అంతగా విజయం సాధించలేదు. ఆ విషయం పక్కన పెడితే బద్రినాథ్ షూటింగ్ సెట్స్ కి స్నేహారెడ్డి వెళ్ళేవారట. పెళ్ళైన కొత్త, అలాగే స్నేహారెడ్డికి పరిశ్రమ గురించి తెలియదు. అల్లు అర్జున్ తో తమన్నా రొమాన్స్ చేస్తుంటే స్నేహారెడ్డి తట్టుకోలేకపోయేవారట. తమన్నా వైపు కోపంగా చేసేవారట. చూపులతోనే తమన్నాకు వార్నింగ్ ఇచ్చిందట. అప్పట్లో తమన్నా పట్ల స్నేహారెడ్డి తీరు సెట్స్ లో చర్చకు దారి తీసిందట. అయితే తర్వాతర్వాత స్నేహారెడ్డికి పరిశ్రమ అంటే ఏమిటో అర్థమైందట.
సీన్ సహజంగా వచ్చేందుకు, ఆడియన్స్ ని మెప్పించేందుకు హీరోయిన్స్ హీరోలతో రొమాన్స్ చేస్తారని అర్థమైందట. అప్పటి నుండి ఆమె బన్నీతో నటించే హీరోయిన్స్ గురించి తప్పుగా భావించడం ఆపేశారట. తమన్నాకు ఇదే అనుభవం రామ్ చరణ్, ఎన్టీఆర్ భార్యలతో కూడా అయ్యిందనే వాదన ఉంది. మరి ఈ పుకార్లలో నిజమెంతో తెలియదు. తమన్నా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా దశాబ్దానికి పైగా ఉన్నారు. ఈ తరం టాప్ స్టార్స్ అందరితో తమన్నా నటించింది.
చిరంజీవి, వెంకటేష్ వంటి సీనియర్స్ తో కూడా జతకట్టింది. హ్యాపీ డేస్, 100 % లవ్ చిత్రాలు ఆమెకు ఫేమ్ తెచ్చాయి. పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు అవుతున్నా తమన్నా క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ చేతినిండా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. ఇటీవల వెబ్ సిరీస్లలో నటిస్తుంది. జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 సిరీస్లలో ఆమె బోల్డ్ రోల్స్ చేశారు. కాగా నటుడు విజయ్ వర్మను ప్రేమిస్తున్నట్లు తమన్నా క్లారిటీ ఇచ్చారు. వారిద్దరూ కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్నారు.