Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ విషయాలకు సంబంధించిన మ్యాటర్ ఎక్కడ వినిపించడం లేదు. గతంలో మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా చేపట్టారు. అయినప్పటికి ప్రశాంత్ వర్మ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ సినిమాని ఆపేశారు. ఇక ఇప్పుడు మరోసారి మోక్షజ్ఞ పేరు ఇండస్ట్రీ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను ప్రొడ్యూసర్ నాగవంశీ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుందట.
తొందరలోనే నాగగా వంశీ ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు. ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ కింగ్ డమ్ లాంటి సినిమాలకు నాగ వంశీ ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. మరోసారి గౌతమ్ తిన్న నూరి వీళ్ళ బ్యానర్ లోనే సినిమా చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది.
మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను గౌతమ్ కి అప్పజెప్పినట్టుగా తెలుస్తుంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందా ప్రేక్షకులందరిని ఆకట్టుకుంటుందా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మోక్షజ్ఞ కి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసే విధంగా ఈ మూవీ ఉండబోతుందా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక బాలయ్య సైతం ఈ సినిమా కథను విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం బాలయ్యకు మజిల్ ఇంజురీ అవ్వడం వల్ల రెస్ట్ తీసుకుంటున్నాడు. బాలయ్య క్యూర్ అయిన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన పూర్తి కథను తనకి వినిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. అక్టోబర్ 20వ తేదీన దసరా కానుకగా ఈ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారట…

