Bigg Boss Telugu 8
Bigg Boss Telugu 8 : హౌస్ లోకి రాబోతున్న 12 మంది వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ని అడ్డుకోవడం కోసం ప్రస్తుతం ఉన్న హౌస్ మేట్స్ కి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ‘సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్’. మొన్న రెండు టాస్కులు బిగ్ బాస్ ఇవ్వగా, నేడు 3 టాస్కులు ఇచ్చాడు. రెండు టాస్కులు ఇరు క్లాన్స్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ ఓడిపోగా, రెండు టాస్కులు శక్తి టీం, ఒక్క టాస్క్ కాంతారా టీం గెలుస్తారు. ఇది ఇలా ఉండగా నిన్న జరిగిన మొదటి టాస్కులో పృథ్వీ, నబీల్ అద్భుతంగా ఆడారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వీళ్లకు ఏ స్థాయి ఓటింగ్ పడుతుందో అధికారికంగా తెలియదు కానీ, వీళ్లిద్దరు టాస్కులు ఆడుతున్న తీరుని బట్టి చూస్తే కచ్చితంగా టాప్ 5 లో ఉండేందుకు అర్హత ఉన్న వారు అనిపిస్తుంది. నిన్నటి ఎపిసోడ్ లో వీళ్లిద్దరికీ బిగ్ బాస్ బెలూన్ పగలకుండా చేతులతో రెండు ఒక రాడ్ ని పట్టుకునే టాస్కుని ఇస్తాడు. ఈ టాస్కులో పృథ్వీ, నబీల్ దాదాపుగా 3 గంటల వరకు కదలకుండా నిల్చొని టాస్కు ఆడుతారు.
కానీ నబీల్ కి భుజం మీద దెబ్బ ఉండడం తో ఇక అతని వల్ల కాక వదిలేస్తాడు, పృథ్వీ రాజ్ గెలుస్తాడు. దీంతో శక్తి క్లాన్ గెలుస్తుంది. గెలిచిన తర్వాత బిగ్ బాస్ తీసుకున్న ఒక నిర్ణయం చూస్తే అభయ్ బిగ్ బాస్ పై చేసిన కామెంట్స్ నిజమే అని అనిపించక తప్పదు. ఇంత చెత్త నిర్ణయాలు, అన్యాయపూరితమైన నిర్ణయాలు బిగ్ బాస్ హిస్టరీ లోనే ఎప్పుడూ జరగలేదు. శక్తి క్లాన్ ఓడిపోయినప్పుడు బిగ్ బాస్ వాళ్ళ టీం లోనే అంతర్గతంగా చర్చించుకొని ఎవరిని తదుపరి టాస్కుల నుండి తప్పిస్తున్నారో చెప్పమంటాడు. వాళ్ళ టీం లో అంతర్గతంగా చర్చించుకొని ఫిజికల్ గా బాగా వీక్ గా ఉన్న మణికంఠ ని తప్పిస్తారు. ఇక్కడి వరకు బాగానే ఉంది, ఇలా ఒక క్లాన్ కి చేసినప్పుడు, కాంతారా టీం కూడా ఓడిపోయినప్పుడు వాళ్ళ టీం లోనే చర్చించుకొని తదుపరి టాస్కుల నుండి తప్పించేవారని ఎంచుకొని చెప్పమనొచ్చు కదా?, కానీ బిగ్ బాస్ ఆ అవకాశం కూడా శక్తి క్లాన్ కి ఇస్తాడు. శక్తి క్లాన్ హౌస్ లో ‘కాంతారా’ టీం లో స్ట్రాంగ్ గా ఉన్న నబీల్ ని తప్పిస్తారు.
దానికి ముందు రోజు నిఖిల్ ఇరు క్లాన్ సభ్యులతో మాట్లాడుతూ ‘ఇది మన హౌస్ మేట్స్ కోసం ఆడుతూ వైల్డ్ కార్డు ఎంట్రీలను అడ్డుకునే టాస్క్. మనం క్లాన్స్ కోసం కాకుండా, మనందరి కోసం ఆడుదాం’ అని అంటాడు. దీనికి అందరూ అంగీకరిస్తారు. అత్యధిక టాస్కులు గెలిచి వైల్డ్ కార్డు ఎంట్రీలను అడ్డుకోవాలంటే కచ్చితంగా నబీల్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ టాస్కులు ఆడాలి. కానీ నిఖిల్ టీం అతనిని తప్పించడం తో ప్రేరణ ‘నిఖిల్..నువ్వు డబుల్ ఫేస్ ఉన్న వ్యక్తివి..చాలా కన్నింగ్’ అంటూ ముఖం మీదనే చెప్పేస్తుంది. ‘మీ టీంలో మాత్రం ఫిజికల్ పరంగా వీక్ గా ఉన్న మణికంఠ ని టాస్కుల నుండి తప్పిస్తారు..మీరు మాత్రం మా క్లాన్ లో నబీల్ లాంటి కంటెస్టెంట్ ని తప్పిస్తారు. నిన్నటి వరకు క్లాన్స్ కోసం కాదు, అందరి కోసం ఆడుకుందాం అని చెప్పిన నువ్వు, ఇప్పుడు నీ క్లాన్ కోసం ఆడుతున్నావు, ఇదెక్కడి న్యాయం’ అని కాంతారా టీం సభ్యులందరూ ప్రశ్నిస్తారు. అప్పుడు నిఖిల్ ‘మణికంఠ’ ని మేము తప్పించలేదు, అతనికి అతనే టాస్కుల నుండి తప్పుకున్నాడు అని అంటాడు. నిజమా అని మణికంఠ ని అడగగానే ‘లేదు’ అని బదులిస్తాడు. దీనికి శక్తి టీం మొత్తం పాపం మణికంఠ ని అనరాని మాటలు అన్నారు. అబద్దాలు చెప్పాడు అంటూ అతనిని టార్చర్ చేసారు.
వాస్తవానికి మణికంఠకు ఆడాలనే ఉంది. కానీ టీం లో సోనియా, యష్మీ, పృథ్వీ రాజ్..ఈ ముగ్గురు మణికంఠ ని టాస్కుల నుండి తప్పుకోవాలని ఓటు వేస్తారు. ఇక చేసేదేమి లేక మణికంఠ కూడా సర్దుకొని మన క్లాన్ ముందుకు పోవాలి కాబట్టి నేను స్వచ్ఛందం గా ఈ టాస్కు నుండి తప్పుకుంటున్నాను అని అంటాడు. దీనిని పట్టుకొని పాపం ఆ అబ్బాయిని టార్గెట్ చేసి టార్చర్ పెట్టారు శక్తి టీం. పాపం మణికంఠ ఒక మూలాన కూర్చొని ఏడుస్తూ ఉండడం చూసి ప్రేక్షకులు బాగా ఎమోషనల్ అయ్యారు. శక్తి క్లాన్ వ్యవహరించిన ఈ తీరు చాలా తప్పు, దీనిని ఈ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున కచ్చితంగా నిలదీస్తాడని ఆడియన్స్ ఆశిస్తున్నారు.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
View Author's Full InfoWeb Title: The shakti team targeted naga manikantha in the survival of the fittest task