Yuvraj Singh : యువరాజ్ సింగ్ మైదానం వెలుపల సాగించిన వ్యవహారాల గురించి అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగేది. మొదట్లో దీపికా పదుకొనే, ఆ తర్వాత లక్ష్మీ రాయ్, తమన్నా, కాజల్ వంటి హీరోయిన్లతో యువరాజ్ అఫైర్లు కొనసాగించాడని పుకార్లు షికార్లు చేశాయి. ఆ తర్వాత అవన్నీ “గాలికి కొట్టుకుపోయిన పేలపిండి” సామెతను నిరూపించాయి. అయితే ఓ హీరోయిన్ తో డేటింగ్ చేశానని యువరాజ్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా లో ఆస్ట్రేలియాపై 2007-08 సమయంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతున్నప్పుడు.. ఆ సంఘటన జరిగిందని యువరాజ్ వెల్లడించాడు. ” పేరు చెప్పను. ఆమె నేపథ్యం వివరించను. ఆస్ట్రేలియా టూర్ లో ఉన్నప్పుడు ఆమెతో డేటింగ్ చేశాను.. ఈ విషయాన్ని చెప్పడంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆమె గొప్ప నటి. అపారమైన అనుభవం ఆమె సొంతం. ఓ సినిమా షూటింగ్ కోసం అడిలైడ్ ప్రాంతానికి వచ్చింది. నన్ను కలవద్దని ఆమెకు వివరించాను. అటపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలనే ఉద్దేశంతోనే అలా అనాల్సి వచ్చింది. ఆమె యాదృచ్ఛికంగా నన్ను కాన్ బెర్రా వరకు అనుసరించింది. రెండు టెస్టులలో నేను పెద్దగా ప్రభావం చూపించలేకపోయాను.. నువ్వు నన్ను ఎందుకు అనుసరిస్తున్నావని అడిగాను. దానికి ఆమె నీతో సమయం గడపాలని నన్ను అడిగింది. దాంతో నేను కాదనలేకపోయాను. ఆరోజు రాత్రి ఆమెను కలిశాను. ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం.. నేను కెరియర్ పై దృష్టి సారించాల్సి ఉందని ఆమెతో అన్నాను. ఆ తర్వాత కాన్ బెర్రా నుంచి ఆడి లైడ్ వెళ్లడానికి మేము సిద్ధమయ్యాం. ఆమె నా సూట్ కేస్ సర్దింది. అందులోనే నా బూట్లు కూడా పెట్టింది. ఇలా ఉట్టికాళ్లతో ఎలా వెళ్లాలని నేను అడిగితే.. నాకు గులాబీ రంగు స్లిప్పర్లు ఇచ్చింది. విమానాశ్రయం వరకు నిన్ను వాటిని వేసుకొని ప్రయాణించాను. నా బ్యాగ్ పట్టుకొని నడిచాను. ఆ గులాబీ రంగు చెప్పులు చూసి చాలామంది నవ్వారని” యువరాజ్ వెల్లడించాడు. అయితే అప్పట్లో యువరాజ్ దీపికతో డేటింగ్ చేశాడని వార్తలు వచ్చాయి.
2007లో భారత జట్టు టి20 వరల్డ్ కప్ గెలవడం లో యువరాజ్ సింగ్ కీలకపాత్ర పోషించాడు. 2011 వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. భారత జట్టును గెలిపించాడు. యువరాజ్ సింగ్ భారత జట్టు తరఫున 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టి20 మ్యాచ్ లు ఆడాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ , మధ్యలో ఫీల్డింగ్ లో సత్తా చాటాడు. అందువల్లే టీమ్ ఇండియాలో స్టార్ ఆల్ రౌండర్ ఎవరనే ప్రశ్న ఎదురైనప్పుడు.. వెంటనే లభించే సమాధానం యువరాజ్ సింగ్.. అయితే అతడు తన డేటింగ్ కు సంబంధించి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More