https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: అప్పుడే హౌస్లో మొదలైన రొమాన్స్, బెజవాడ బేబక్కతో బాత్ రూమ్ ఏరియాలో ఆ కంటెస్టెంట్ ఏమన్నాడో తెలుసా? వీడియో వైరల్

బిగ్ బాస్ హౌస్లో అప్పుడే రొమాన్స్ మొదలైంది. సోషల్ మీడియా స్టార్ బేబక్కకు ఓ కంటెస్టెంట్ ఐ లవ్ యూ చెప్పాడు. అది కూడా బాత్ రూమ్ ఏరియాలో. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : September 2, 2024 / 02:26 PM IST

    Bigg Boss 8 Telugu(9)

    Follow us on

    Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా సెప్టెంబర్ 1న ఘనంగా ముగిసింది. కింగ్ నాగార్జున ఆధ్వర్యంలో కంటెస్టెంట్స్ వేదికపై సందడి చేశారు. హీరో నాని, హీరోయిన్ ప్రియాంక మోహన్, దర్శకుడు అనిల్ రావిపూడి అతిథులుగా హాజరయ్యారు. సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్లే సెలెబ్స్ ఎంట్రీ ఇచ్చారు. యాష్మి గౌడ, నిఖిల్, నాగ మణికంఠ, నబీల్ ఆఫ్రిది, ఆదిత్య ఓం, నైనిక, ప్రేరణ, బెజవాడ బేబక్క, శేఖర్ బాషా కంటెస్టెంట్స్ గా హౌస్లోకి ప్రవేశించారు.

    అలాగే అభయ్ నవీన్, సోనియా ఆకుల, విష్ణుప్రియ, పృథ్విరాజ్, కిరాక్ సీత సైతం లేటెస్ట్ సీజన్ కి కంటెస్టెంట్స్ గా ఎంపికయ్యారు. కంటెస్టెంట్స్ పరంగా ఆడియన్స్ కొంత నిరాశ చేశారు. కేవలం 14 మందిని పరిచయం చేశారు. వీరిలో పాపులారిటీ కలిగిన సెలెబ్స్ చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. విష్ణుప్రియ, యాష్మి గౌడ, నిఖిల్, ఆదిత్య ఓం మాత్రమే కొంచెం తెలిసిన ముఖాలు.

    వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరికొందరు కంటెస్టెంట్స్ ని హౌస్లోకి ప్రవేశ పెట్టనున్నారని సమాచారం. కాగా అప్పుడే హౌస్లో రొమాన్స్ మొదలైంది. కొందరు అబ్బాయిలు అమ్మాయిలతో పులిహోర కలపడం స్టార్ట్ చేశారు. బెజవాడ బేబక్కకు ఓ కంటెస్టెంట్స్ ఐ లవ్ యూ చెప్పడం సంచలనం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

    బెజవాడ బేబక్కకు ఐ లవ్ యూ చెప్పిన కంటెస్టెంట్ ఎవరో కాదు. శేఖర్ బాషా ఆమెకు ఒకింత షాక్ ఇచ్చాడు. బట్టలు సర్దుకుంటున్న శేఖర్ బద్దకు బేబక్క వెళ్ళింది. ఆ సమయంలో శేఖర్ బాత్ రూమ్ ఏరియాలో ఉన్నాడు. బాత్ రూమ్ ఏరియా నుండి వ్యూ బాగుంటుందని బేబక్క శేఖర్ తో అన్నారు. అనంతర శేఖర్ అందరికీ నచ్చిన వ్యూ.. ఐ లవ్ యూ అన్నాడు.

    శేఖర్ బాషా సడన్ గా అలా అనడంతో బేబక్క షాక్ అయ్యింది. అమ్మో ఇప్పుడు థంబ్ నెయిల్స్ పెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారేమో. నేనేదో ఫన్ కోసం అన్నాను. నాకు ఆమె అక్క… బేబక్క అన్నాడు శేఖర్. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. కేవలం ఫన్ కోసం శేఖర్ బాషా అలా ఐ లవ్ యూ చెప్పాడు. అంతే కానీ ఎలాంటి చెడు ఉద్దేశం లేదని అర్థమవుతుంది..