https://oktelugu.com/

Balakrishna: మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పైన క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ…సినిమా వచ్చేది ఎప్పుడంటే..?

సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఇక ఈ క్రమం లోనే తన కొడుకు అయిన మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అనేదే తెలియాల్సి ఉంది...

Written By:
  • Gopi
  • , Updated On : September 2, 2024 / 02:11 PM IST

    Balakrishna(1)

    Follow us on

    Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన లెగసీని కంటిన్యూ చేస్తూ బాలయ్య బాబు నందమూరి ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లాడు. ఇక మూడో తరం హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా నందమూరి ఫ్యామిలీ బరువు బాధ్యతలను నిలబెట్టే విధంగా ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ కూడా మూడోవ తరం జనరేషన్ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక ఇప్పటికే పలు రకాల స్క్రిప్ట్ లను విన్న బాలయ్య కొన్ని స్క్రిప్ట్ లను ఫైనల్ చేసి పెట్టాడట. మరొక మూడు నెలల్లో మోక్షజ్ఞకు సంబంధించిన సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ బాలయ్య రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం… అలాగే మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ లను అందుకోవాలని అందుకోసమే కథ చర్చలను జరుపుతున్నామని బాలయ్య బాబు చెప్పాడు. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అంటూ ప్రస్తుతం జనాల్లో తీవ్రమైన చర్చలైతే జరుగుతున్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే మోక్షజ్ఞ సినిమా రిలీజ్ కి ముందే స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు అంటూ బాలయ్య బాబు ఫన్నీ కామెంట్స్ కూడా చేశాడు.మోక్షజ్ఞ ఎంట్రీ తో చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడమే కాకుండా నందమూరి ఫ్యామిలీ మూడోవ జనరేషన్ స్టార్ హీరోగా మోక్షజ్ఞ ను నిలపాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది.

    అయితే తన మొదటి సినిమాకు ఎవరు దర్శకత్వం వహించబోతున్నారు అనే విషయం మీద మాత్రం సరైన క్లారిటీ ఇవ్వడం లేదు. తొందర్లోనే ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రేక్షకులతో పంచుకోవడానికి రెడీ అవుతున్నామంటే బాలయ్య బాబు చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయనే చెప్పాలి. మరి మోక్షజ్ఞ సినిమా ప్రస్థానం ఏ విధంగా సాగుతుంది.

    తనకు మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ వస్తుందా లేదంటే నాగార్జున కొడుకుల మాదిరిగానే తను కూడా చాలావరకు స్ట్రగుల్స్ ని ఎదుర్కోవాల్సిన ఇబ్బంది ఏర్పడుతుందా? అనేది కూడా తెలియాల్సి ఉంది… ఏది ఏమైనప్పటికీ నందమూరి బాలకృష్ణ నట వారసుడి ఎంట్రీ అంటే మామూలుగా ఉండదనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.

    మరి ఈ సినిమా కోసం ఎవరిని దర్శకుడిగా తీసుకోబోతున్నారనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి…బాలయ్య బాబు అంటే మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారాడు. మరి మోక్షజ్ఞ కూడా మాస్ లో మంచి పట్టును సాధిస్తాడా లేదంటే క్లాస్ సినిమాలకే పరిమితం అవుతాడా అనేది కూడా తెలియాల్సి ఉంది…