Junior NTR: సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపును అయితే ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ లుగా నిలవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. నిజానికి ఆయన లాంటి నటుడు ఇండస్ట్రీలో మరొకరు లేరు అనేది మాత్రం వాస్తవం… ఇక ఇదిలా ఉంటే నందమూరి నట సింహంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య బాబు ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఒక ఈవెంట్ ని కూడా రీసెంట్ గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కి నందమూరి ఫ్యామిలీని ఆహ్వానించే బాధ్యతలను నందమూరి రామకృష్ణ తీసుకున్నారు. అయితే ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లను ఆహ్వానించారా లేదా అనే విషయం మీద సరైన స్పష్టత లేదు కానీ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి లాంటి రెండు రాష్ట్రాల సీఎంలు ఈ ఈవెంట్ కి హాజరు కాకపోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే వరదల కారణంగా జనాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి వాళ్లు ఆ జనాన్ని కాపాడే పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఈ ఈవెంట్ కి హాజరవ్వలేకపోయారు. ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం తన తల్లిని తీసుకొని కర్ణాటకలోని దేవస్థానాలను సందర్శించే కార్యక్రమంలో బిజీగా ఉన్నాడు. అందువల్ల ఆయన ఈవెంట్ కి హాజరు కాలేకపోయాడేమో అని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
గతంలో సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో కూడా నందమూరి ఫ్యామిలీ నుంచి అందరూ ఆ ఈవెంట్ కి హాజరయ్యారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లు మాత్రమే రాలేదు. ఇక ఆ సమయం లో జూనియర్ ఎన్టీయార్ విదేశాల్లో ఉండడమే దానికి కారణం అన్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయినప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ వాళ్లతో సన్నిహితంగా ఉండడం లేదు అంటూ చాలా రకాల వార్తలైతే వెలువడ్డాయి.
కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత కూడా తన వైఖరిని మార్చుకోకుండా వాళ్లతో సన్నిహితంగా ఉండడానికి జూనియర్ ఎన్టీఆర్ ఇష్టపడడం లేదనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఎన్టీఆర్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒకేలా ఉంటున్నాడు.
అంతే తప్ప వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలో లేనప్పుడు మరొకలా బిహేవ్ చేయడం లేదు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది… ఇక ప్రస్తుతం ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న ‘దేవర’ సినిమా ఈనెల 27 వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని తొందర్లోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు…