Meenakshi Chowdhury : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల హవా ఎక్కువగా కొనసాగుతుంది. రీసెంట్ గా వచ్చిన స్టార్ హీరోయిన్స్ సైతం వాళ్ళని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ స్టార్ హీరోల పక్కన అవకాశాలను అందుకుంటు ముందుకు సాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమాలో మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఆ తర్వాత వచ్చిన సినిమాలో కూడా ఆమె నటిగా మెప్పించడమే కాకుండా మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంది. అయితే ఈ రెండు సినిమాలు కూడా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో రావడం విశేషం… మరి ఈమె సితార ఎంటర్టైర్మెంట్స్ బ్యానర్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తుంది అంటూ కొన్ని రకాల వార్తలైతే వినిపిస్తున్నాయి. నిజానికి ఆమె ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించింది.
ప్రస్తుతం మీనాక్షి చౌదరి మరో రెండు సినిమాలను హీరోలు హీరోయిన్లు గా తీసుకురావడానికి చాలామంది దర్శక నిర్మాతలు మాత్రం ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో వచ్చే మరో రెండు సినిమాలకు కూడా ఆమె తెలుస్తుంది. మరి ఎందుకు ఆమె సితార లో ఎక్కువ సినిమాలు చేస్తుంది అంటే మొదట్లోనే ఈ అమ్మడుతో నాలుగు సినిమాలు చేయించుకోవడానికి అగ్రిమెంట్ రాసుకున్నట్టుగా తెలుస్తోంది.
కాబట్టి ఆమె ఈ సినిమాలో నటిస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఈ అమ్మడు మంచి ఫామ్ లో ఉంది. కాబట్టి ఆ ఫాలోయింగ్ ను వాడుకునే ప్రయత్నంలో నిర్మాణ సంస్థలు ఉండటంలో తప్పయితే లేదు అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీ అనేది అల్టిమేట్ గా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి హీరోయిన్లను బట్టి ప్రేక్షకుడు సినిమా థియేటర్ కి వస్తూ ఉంటాడు.
కాబట్టి ఆ సినిమా వాళ్ళని ఎంగేజ్ చేయగలిగితే మాత్రం సగటు ప్రేక్షకులను పొందడమే కాకుండా మంచి విజయాలను కూడా అందుకోవడానికి అవకాశమైతే ఉంటుంది…చూడాలి మరి ఇకమీదట మీనాక్షి చౌదరి చేయబోయే సినిమాలు కూడా మంచి విజయాలను సాధించి టాప్ హీరోయిన్ గా ఎదుగుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…