https://oktelugu.com/

Ananth Sriram : అనంత్ శ్రీరామ్ చేసిన పనికి ఇండస్ట్రీ మొత్తం తలదించుకుందా..?ఆయన మీద వేటు పడబోతుందా..?

సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు చాలామంది దర్శకులు మంచి సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్నారు...మరి ఇది ఏమైనా కూడా ఇప్పటికే స్టార్ డైరక్టర్లు చేస్తున్న ప్రతి సినిమా కూడా పాన్ ఇండియాలో మంచి గుర్తింపును సంపాదిస్తూ ముందుకు సాగుతుండటం విశేషం...ఇక ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో టాప్ మూవీస్ గా మన తెలుగు సినిమాలే ఉండటం విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : January 8, 2025 / 08:15 PM IST

    Ananth Sriram

    Follow us on

    Ananth Sriram :  సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాత తో పాటు ఆ సినిమాకి పనిచేసే ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా తమ ప్రాణం పెట్టి పని చేస్తేనే ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా సినిమా సిచువేషన్ కు తగ్గట్టుగా పాటలను రాసే రచయితలు కూడా వాళ్ళ మార్క్ చూపించకపోతే ఏదో ఒక విషయంలో కొంతవరకు అసంతృపైతే వ్యక్తం అవుతుంది. మొత్తానికైతే సినిమాలో ఉన్న ఫీల్ క్యారీ చేసే విధంగా రచయితలే చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి రచయితగా మంచి గుర్తింపును సంపాదించుకున్న అనంత శ్రీరామ్ రీసెంట్ గా జరిగిన ఒక సభలో తెలుగు సినిమా ఇండస్ట్రీని అగౌరవపరుస్తూ కొన్ని వాక్యాలైతే చేశాడు. అలాగే కల్కి సినిమా గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయన మీద చాలా మంది చాలా రకాల నెగెటివ్ అభిప్రాయాలైతే తెలియజేస్తున్నారు. మరి ఇప్పటివరకు పెద్ద సినిమాలకు సాంగ్స్ రాసుకుంటూ వచ్చిన ఆయన ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల పలువురు సినీ పెద్దలు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

    ఇకమీదట అనంత శ్రీరామ్ కి పెద్ద సినిమాల నుంచి ఆఫర్లు రాకపోవచ్చు అంటూ కొంతమంది కొన్ని రకాల కామెంట్లను కూడా తెలియజేయడం విశేషం. మరి ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఎక్కువ అవకాశాలు రావాలి అంటే కామ్ గా ఉంటూ మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగాలి. అంతే తప్ప ఇండస్ట్రీలో ఉంటూ ఇండస్ట్రీ నుంచి వచ్చే డబ్బులతోనే జీవితాన్ని గడుపుతూ అలా ఇండస్ట్రీ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది మామూలు విషయం కాదు.

    ఇక దీనివల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆయా సినిమా నిర్మాతలు దర్శకులతో పర్సనల్ గా మాట్లాడుకోవాలి తప్ప ఇలా బహిరంగంలో మాట్లాడటం అనేది మన ఇండస్ట్రి ని మనం తక్కువ చేసుకొని మాట్లాడుకోవడం అవుతుంది. అంటూ కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

    మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు అనంత శ్రీరామ్ పైన యావత్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. మరి ఇక మీదట ఆయనకు పెద్ద సినిమాల నుంచి అవకాశాలు రాకపోయినా పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన అవసరమైతే లేదు అంటూ మరి కొంతమంది సినిమా విమర్శకులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…