Jr NTR : జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘వార్ 2’. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటిస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పార్ట్ పూర్తి అయ్యింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య వచ్చే పోరాటసన్నివేశాలు మొత్తాన్ని షూటింగ్ చేసి పూర్తి చేశారట. ఇప్పుడు కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య వచ్చే ఒక సాంగ్ చిత్రీకరణ, అదే విధంగా కొన్ని కీలక సన్నివేశాలు మాత్రమే బ్యాలన్స్ ఉందట. శరవేగంగా షూటింగ్ ని పూర్తి చేసుకోబోతున్న ఈ సినిమాని ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేసారు. అందుకు తగ్గట్టుగానే షెడ్యూల్స్ ని కూడా పెట్టుకున్నారు. అయితే అదే తేదీన ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో టెర్టాకెక్కుతున్న ‘కూలీ’ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.
ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గత మూడు నెలల నుండి విరామం లేకుండా షూటింగ్ ని జరుపుకుతున్న ఈ సినిమా వచ్చే నెలతో 70 శాతం కి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకోబోతుందని టాక్. అదే కనుక జరిగితే ఈ సినిమాని ఆగష్టు 14 న ఎట్టి పరిస్థితిలో విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ప్రస్తుతానికి అయితే ఈ సినిమాకి ఉన్నంత క్రేజ్ ‘వార్ 2 ‘ చిత్రం పై ఆడియన్స్ లో లేదు. ఎందుకంటే లోకేష్ కనకరాజ్ సినిమాలకు యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. దానికి తోడు సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి హీరో తోడైతే ఇక అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. లోకేష్ తో కనీసం ఒక్క సినిమా అయినా చేయాలి అని ఇప్పుడున్న హీరోలు తపిస్తూ ఉంటారు.
అందుకే ఒకవేళ ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదలైతే సౌత్ లో కూలీ డామినేషన్ మామూలు రేంజ్ లో ఉండదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి ‘వార్ 2 ‘ రిస్క్ చేసి ఆగస్టు 14 న వస్తుందా?, లేదా వాయిదా పడుతుందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ రెండు సినిమాలా విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. సంక్రాంతికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది. ‘వార్ 2 ‘ లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడని టాక్ కూడా ఉంది. ఒక క్యారక్టర్ దేశం కోసం పోరాడేలా ఉంటే, మరో క్యారక్టర్ టెర్రరిస్ట్ లాగా ఉంటుందని తెలుస్తుంది. హ్రితిక్ రోషన్ ఇందులో మెయిన్ హీరో గా నటిస్తున్నాడు. కైరా అద్వానీ ఆయనకీ జోడీగా నటిస్తుంది.