Raja Saab
The Raja Saab: కల్కి మూవీ ప్రభాస్ లో జోష్ నింపింది. తన స్థాయి విజయం దక్కింది. దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కించిన కల్కి వరల్డ్ వైడ్ రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కమల్ హాసన్, అమితాబ్, దీపికా పదుకొనె వంటి స్టార్స్ ఈ చిత్రంలో నటించారు. కాగా ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్, హను రాఘవపూడి చిత్రాల్లో నటిస్తున్నాడు. దర్శకుడు మారుతి రాజాసాబ్ చిత్రానికి దర్శకుడు. ప్రభాస్ కి భిన్నమైన జానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. రాజాసాబ్ హారర్ కామెడీ అంటున్నారు. దాదాపు సెట్స్ లో చిత్రీకరణ జరుపుతున్నారు. రాజాసాబ్ షూటింగ్ దాదాపు పూర్తి అయ్యిందట. టాకీ పార్ట్ కంప్లీట్ కాగా, కొన్ని పాటల చిత్రీకరణ ఉందని అంటున్నారు.
Also Read: విజయ్ దేవరకొండ చేస్తున్న ‘రౌడీ జనార్ధన్’ మూవీ స్టోరీ ఇదేనా..?
అయితే టాకీ పార్ట్ నిడివి 3 గంటలకు పైగా ఉందట. సాంగ్స్ జోడిస్తే రాజాసాబ్ రన్ టైం ముందున్నర గంటలు దాడిపోతుంది. ఈ క్రమంలో ఎడిటింగ్ కష్టం కానుందట. కథలో లింక్స్ మిస్ కాకుండా కొన్ని సన్నివేశాలు తీసేయాలి. రాజాసాబ్ టీమ్ కి అది పెద్ద టాస్క్ అంటున్నారు. రాజాసాబ్ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తేదీకి రాజాసాబ్ రావడం కష్టమే అంటున్నారు. రాజాసాబ్ ని ఏప్రిల్ లో విడుదల చేసే ఛాన్స్ లేదని పరిణామాలు గమనించినా అర్థం అవుతుంది.
విడుదలకు నెల రోజుల సమయం కూడా లేదు. టీమ్ ఎలాంటి ప్రమోషన్స్ చేయడం లేదు. అసలు రాజాసాబ్ 2025లో విడుదల కావడం అనుమానమే అనే వాదన గట్టిగా వినిపిస్తుంది. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ ని నిరాశ పరిచే అంశమే. ప్రభాస్ ప్రతి సినిమా విషయంలో ఇదే జరుగుతుంది. చెప్పిన తేదీకి రావడం కలగానే మిగిలిపోతుంది. ఈ మధ్య కాలంలో ప్రభాస్ నటించిన ప్రతి సినిమా విడుదల తేదీలు మారాయి. ఇక రాజాసాబ్ చిత్రాన్ని నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కి సమస్యలు మొదలయ్యాయి.
ఇప్పటికే రాజాసాబ్ మేకింగ్ ఆలస్యమైంది. బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతుంది. రాజాసాబ్ నిర్మాతల్లో టెన్షన్ మొదలైందట. రాజాసాబ్ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఆ మధ్య విడుదల చేసిన ప్రభాస్ లుక్ తో కూడిన ప్రోమో విపరీతంగా ఆకట్టుకుంది. ప్రభాస్ చాలా గ్లామరస్ గా ఉన్నాడు. ఇక ప్రభాస్ లైనప్ చూస్తే.. హను రాఘవపూడి మూవీ సెట్స్ పై ఉంది. సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ చేయాల్సి ఉంది. ప్రశాంత్ వర్మతో ఒక మూవీకి సైన్ చేశాడంటూ వార్తలు వస్తున్నాయి.
Web Title: The raja saab in trouble bad news for prabhas fans
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com