Tollywood Films In Japan: మన ఇండియన్ సినిమాలకు విదేశాల్లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా జపాన్(Japan) లో మన సినిమాలకు బ్రహ్మరథం పడుతుంటారు మన ఆడియన్స్. ముందుగా రజనీకాంత్(Superstar Rajinikanth) సినిమాల వల్ల జపాన్ లో మన ఇండియన్స్ కి ఒక గుర్తింపు లభించింది. ఆ తర్వాత బాలీవుడ్ హీరోలు బాగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు టాలీవుడ్ హీరోలు శాసిస్తున్నారు. ఎన్టీఆర్(Junior NTR), రామ్ చరణ్, ప్రభాస్ వంటి హీరోలకు జపాన్ లో ఉన్నటువంటి క్రేజ్ సాధారణమైనది కాదు. ఈ క్రేజ్ ని కాష్ చేసుకుంటూ ఈ ముగ్గురి సినిమాలు జపాన్ లో డబ్ అయ్యి విడుదల అవుతున్నాయి. ప్రభాస్(Rebel Star Prabhas), రామ్ చరణ్(Global Star Ram Charan) సినిమాలు అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. దానిని చూసి ఎన్టీఆర్ కూడా తన ‘దేవర'(Devara Movie) చిత్రాన్ని జపాన్ లో విడుదల చేయబోతున్నాడు. ఈ నెల 28 వ తారీఖున దేవర చిత్రం జపాన్ దేశంలో విడుదల కానుంది.
Also Read: విజయ్ దేవరకొండ చేస్తున్న ‘రౌడీ జనార్ధన్’ మూవీ స్టోరీ ఇదేనా..?
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఎన్టీఆర్ పలు జపాన్ టీవీ చానెల్స్ కి ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాడు. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ టికెట్ సేల్స్ ఆశించిన స్థాయిలో లేవని అక్కడి ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ చిత్రం ఇక్కడ సంచలన విజయం సాధించింది. మొదటి రోజు ఈ చిత్రానికి దాదాపుగా 1600 టికెట్స్ అమ్ముడుపోయాయి. #RRR , సాహూ, సాలార్, పఠాన్ చిత్రాల తర్వాత ‘రంగస్థలం'(Rangasthalam Movie) చిత్రం నిల్చింది. ఎప్పుడో 2017 వ సంవత్సరం లో విడుదలైన సినిమాని, ఇప్పుడు రీ రిలీజ్ చేసినా ఇన్ని టికెట్స్ అమ్ముడుపోవడం సాధారణమైన విషయం కాదు. మొదటి రోజు నాలుగు మిలియన్ల జపనీస్ డాలర్లను వసూళ్లు చేసిన ఈ సినిమా, వీకెండ్ కి పది మిలియన్ జపనీస్ డాలర్స్, ఫుల్ రన్ లో 40 మిలియన్ల జపనీస్ డాలర్స్ ని రాబట్టి సంచలనం సృష్టించింది.
‘దేవర’ చిత్రానికి ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ రేంజ్ వసూళ్లు కష్టమే అని అనిపిస్తుంది. ఇప్పటి వరకు బుకింగ్స్ ప్రారంభం అయ్యినప్పటి నుండి కేవలం నాలుగు టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. రాబోయే రోజుల్లో గణనీయమైన టికెట్స్ సేల్స్ జరగాలి. లేకుండా రంగస్థలం ని బీట్ చేయడం కష్టమే. ప్రస్తుతం జపాన్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ 5 సినిమాల లిస్ట్ తీస్తే, #RRR చిత్రం 2400 మిలియన్ల జపనీస్ డాలర్స్ ని వసూలు చేసి నెంబర్ 1 స్థానం లో నిలబడగా, బాహుబలి2 చిత్రం 305 మిలియన్ డాలర్లు, మగధీర చిత్రం 131 మిలియన్ డాలర్లు, సాహూ 130 మిలియన్ డాలర్లు, బాహుబలి 75 మిలియన్ డాలర్లు, రంగస్థలం 40 మిలియన్ డాలర్లు రాబట్టాయి. ‘దేవర’ చిత్రం ఏ మేరకు వసూళ్లు రాబడుతుందో చూడాలి.