The Raja Saab First Day Worldwide Collections: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన ‘రాజా సాబ్'(The Rajasaab Movie) చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఆ నెగిటివ్ టాక్ ప్రభావం నూన్, మ్యాట్నీ షోస్ మీద చాలా బలంగా పడింది కానీ, ఫస్ట్ షోస్ నుండి కాస్త పికప్ అయ్యాయి. ఇక సెకండ్ షోస్ అయితే అన్ని సెంటర్స్ లో దుమ్ము దులిపేసింది. ఫ్లాప్ టాక్ వల్ల ఘోరమైన డిజాస్టర్ ఓపెనింగ్స్ వస్తాయని అంతా అనుకున్నారు కానీ, ప్రభాస్ పరువు నిలబెట్టే ఓపెనింగ్ ని చివరికి సొంతం చేసుకుంది. ముఖ్యంగా నైజాం ప్రాంతం లో ఈ చిత్రం చాలా డీసెంట్ వసూళ్లను నమోదు చేసుకుంది. ప్రీమియర్ షోస్ భారీగా లేకపోవడం ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది ఈ ప్రాంతంలో. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి గ్రాస్ వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి నైజాం ప్రాంతం లో మొదటి రోజు 18.6 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. షేర్ వసూళ్లు దాదాపుగా 12 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా. అదే విధంగా ఆంధ్రా + సీడెడ్ ప్రాంతం నుండి 34 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 52.6 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 34 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. వచ్చిన టాక్ కి ఇది చాలా డీసెంట్ షేర్ వసూళ్లు అనే చెప్పాలి. ఇక ఓవర్సీస్ ప్రాంతం నుండి ఈ చిత్రానికి కేవలం 27 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అదే విధంగా కర్ణాటక ప్రాంతం నుండి 6 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 8 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 93.6 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’, పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రాలకంటే తక్కువ ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి కానీ , ఓవర్సీస్ ప్రాంతం లో ఆ రెండు సినిమాల కంటే డీసెంట్ వసూళ్లను నమోదు చేసుకోవడం తో ప్రభాస్ పరువుని నిలబెట్టే రేంజ్ ఓపెనింగ్ దక్కింది. ఆయన అభిమానులకు మొదటి రోజు వంద కోట్ల గ్రాస్ మిస్ అయ్యామే అనే బాధ ఉంటుంది కానీ, ఈ టాక్ తో కూడా ఈ రేంజ్ గ్రాస్ ని రాబట్టినందుకు ప్రభాస్ స్టార్ స్టేటస్ ని చూసి గర్వపడొచ్చు అనే చెప్పాలి.