Revanth Government Toll Charges: గులాబీ రాష్ట్ర సమితి సోషల్ మీడియా గాయి గత్తర చేసింది. దాని అనుకూల మీడియా అడ్డగోలుగా రాసింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరును తీవ్రంగా తప్పు పట్టింది. వాస్తవానికి విజయవాడ హైదరాబాద్ వెళ్లే రూట్లో సంక్రాంతి సందర్భంగా రెండు రోజులపాటు టోల్ ఫీజు మాఫీ చేయాలని కేంద్రానికి సర్కారు లేఖ రాసింది. ఈ లేఖను చూపిస్తూ గులాబీ పార్టీ మీడియా, సోషల్ మీడియా అడ్డగోలుగా రాసింది. కానీ, రేవంత్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవడం ఎంత మంచిదో ఇప్పుడు అర్థమవుతుంది.
సంక్రాంతి సందర్భంగా ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి చాలామంది వెళ్తుంటారు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో చాలావరకు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు స్థిరపడ్డారు. సంక్రాంతి వారికి పెద్ద పండుగ. నాలుగు రోజులపాటు కుటుంబంతో గడుపుతుంటారు. ఇక కోడిపందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి భారీగా వెళ్తారు కాబట్టి హైవే మీద ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. అలాంటప్పుడు ప్రయాణికులు గంటల తరబడి రోడ్డుమీద పడిగాపులు కాయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లెటర్ రాసింది. ఆ లెటర్ వల్ల ఎంత ఉపయోగం జరిగిందో ఇప్పుడు ప్రయాణికులకు అర్థమవుతుంది.
రేవంత్ చేసిన ఈ ప్రతిపాదనల ఆధారంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గురువారం సాయంత్రం హైదరాబాద్, విజయవాడ హైవే లోని పంతంగి టోల్ ప్లాజాలో సాటిలైట్ ఆధారిత ఆటోమేటిక్ టోల్ కలెక్షన్ ట్రయల్ మొదలుపెట్టింది. ఈ టోల్ ప్లాజాలో మొత్తం 16 బూత్ లు ఉన్నాయి. వీటిలో విజయవాడ వైపు ఉన్న ఎనిమిది బూత్ లను ట్రైలర్ కోసం ఉపయోగించారు. వాహనాల నెంబర్లను కచ్చితంగా గుర్తించడం, వాటిని ఆపాల్సిన అవసరం లేకుండానే టోల్ మొత్తాలను స్వీకరించడానికి కెమెరాలు, సెన్సార్ లు ఉపయోగించారు. అయితే ఇందులో చిన్న చిన్న లోపాలు అధికారుల పరిశీలనలో బయటపడ్డాయి. దీంతో వాటిని సవరించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు. ట్రాఫిక్ మొత్తాన్ని నియంత్రించడానికి రెండు అదనపు బూత్ లను కూడా ఏర్పాటు చేశారు. వీటిలో హ్యాండ్ హెల్డ్ పరికరాలను ఉపయోగించి FZST Tag ద్వారా చెల్లింపులు స్వీకరిస్తారు. ఒక్కో బూత్ నిమిషానికి 20 వాహనాలను క్లియర్ చేస్తుందని.. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పేర్కొన్నారు.