https://oktelugu.com/

Salaar 2 : సలార్ 2 నుంచి లీకైన డైలాగ్ మామూలుగా లేదుగా…కత్తి మీద మరో డైలాగ్ చెప్పబోతున్న ప్రభాస్….ఇక రచ్చ రచ్చే…

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళ కంటు ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ లాంటి స్టార్ హీరో సైతం ఇండియాలో తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాకుండా ఆయనకంటూ ఒక మంచి గుర్తింపును కూడా సంపాదించి పెట్టుకున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : December 21, 2024 / 01:04 PM IST

    Salaar 2

    Follow us on

    Salaar 2 : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోలందరూ తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇప్పటివరకు వాళ్ళు సాధించిన విజయాలు మామూలుగా లేవు… ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలుగా తమ సత్తాను చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న మన స్టార్ హీరోలు అందరూ వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటివరకు మన హీరోలందరూ సాధించిన విజయాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సంవత్సరంలో భారీ విజయాలను సాధించడమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని సైతం తట్టుకోని నిలబడగలిగారు. ఇక ఇలాంటి సందర్భంలో ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ నే ఇండియాలో నెంబర్ వన్ ఇండస్ట్రీ గా కొనసాగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ప్రభాస్ లాంటి స్టార్ హీరో సైతం ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఫౌజీ, స్పిరిట్ లాంటి సినిమాలను చేస్తున్న ఆయన సలార్ 2 సినిమాని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక సలార్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనందరికి తెలిసిందే. మరి ఈ సినిమాతో ఒక్కసారిగా తన మార్కెట్ ను భారీగా పెంచుకున్నాడు. ఇక ప్రశాంత్ నీల్ సైతం ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్లో నిలిపే ప్రయత్నం చేస్తున్నారనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ఈ స్టార్ డైరెక్టర్లు ప్రస్తుతం సలార్ 2 సినిమాలో ప్రభాస్ ని మరో కొత్త యాంగిల్ లో చూపించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నప్పటికి ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో సలార్ 2 సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నాడు.

    అయితే ఇది ఇలా ఉంటే సలార్ 2 సినిమా నుంచి ప్రశాంత్ నీల్ ఒక డైలాగ్ నైతే లీక్ చేశారు. అది ఏంటి అంటే ప్రభాస్ గురించి వాళ్ళ అమ్మ ఒక డైలాగు చెబుతూ వాడు ‘కత్తి పట్టుకుంటే ప్రళయ కాలా రుద్రుడవుతాడు. పొడిచే పోటు కి పోయే చెప్పు ప్రాణం ఎవరిదో కూడా తెలియని రేంజ్ లో చంపుతాడు’.

    అంటూ ఒక డైలాగ్ అయితే లీక్ చేశారు. మరి ప్రస్తుతం ఈ లీకైన డైలాగ్ సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతుంది. అలాగే ప్రభాస్ అభిమానులు ఈ డైలాగులను చూస్తే సంబరాలు చేసుకుంటున్నారు.

    మరి ఏది ఏమైనా కూడా ప్రశాంత్ నీల్ సలార్ 2 సినిమా మీద హైప్ ని పెంచడానికి ఇలాంటి ఒక డైలాగులు రిలీజ్ చేశారంటూ చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి మొత్తానికైతే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ డైలాగ్ సినిమాలో ఉంటుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…