Sonia : బిగ్ బాస్ సీజన్ 8 లో ఉన్నది కేవలం నాలుగు వారాలు అయ్యినప్పటికీ, బోలెడంత కంటెంట్ ని అందించి హౌస్ ని గడగడలాడించి వెళ్లిన కంటెస్టెంట్ సోనియా ఆకుల. తక్కువ రోజులు హౌస్ లో ఉంటూ, ఈ స్థాయి బలమైన ప్రభావం షో మీద చూపించి వెళ్లిన కంటెస్టెంట్ బిగ్ బాస్ చరిత్రలో బహుశా ఎవ్వరూ లేరేమో. సోనియా ఆ స్థాయి సెన్సేషన్ ని సృష్టించింది. అయితే హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత పలు ఇంటర్వ్యూస్ లో ఈమె బిగ్ బాస్ టీం పై, హోస్ట్ నాగార్జున పై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. 30 ఏళ్లుగా కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు మొత్తం బిగ్ బాస్ టీం చెడగొట్టారని, హౌస్ లో జరిగింది చూపించకుండా, వాళ్లకి ఇష్టమొచ్చినట్టు ఎడిట్ చేసి చూపించారని ఆరోపణలు చేసింది. అయితే అన్ని ఆరోపణలు చేసినప్పటికీ బిగ్ బాస్ టీం రీ ఎంట్రీ కోరి నామినేషన్ వేయమంటే, వచ్చి వేసి వెళ్తుంది సోనియా.
ఆమె రీ ఎంట్రీ ఇచ్చి వెళ్లిన ఆ కాసేపు కూడా హౌస్ మొత్తం షేక్ అయ్యింది. ఇది ఇలా ఉండగా నిన్న ఆమె పెళ్లి యష్ అనే వ్యక్తితో హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్ళికి బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ అందరితో పాటు, ఆమె స్నేహితులు, సన్నిహితులు కూడా పాల్గొన్నారు. కానీ హౌస్ లో ఆమె ఉన్నన్ని రోజులు పృథ్వీ, నిఖిల్ తో ఎంత క్లోజ్ గా ఉండేదో మన అందరికీ తెలిసిందే. చిన్నోడు, పెద్దోడు అంటూ చాలా ముద్దుగా పిలిచుకునేది. అసలు హౌస్ లో నిఖిల్ మీద ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ, సోనియా ఏంటి సోదరుడు అని చెప్పి ఇలా ప్రవర్తిస్తుంది అని ఆడియన్స్ ముక్కున వేలేసుకున్నారు. నిఖిల్ కూడా సోనియా కి ఎంతో గౌరవం ఇచ్చారు.
ఎంత మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఎలిమినేట్ అయిన ఏడవని నిఖిల్, పృథ్వీ సోనియా ఎలిమినేట్ అవ్వగానే వెక్కిళ్లు పెట్టి ఏడ్చేశారు. ఆమెతో అంత మంచి బాండింగ్ ని ఏర్పాటు చేసుకున్న వీళ్లిద్దరు, ఇప్పుడు ఆమె పెళ్ళికి హాజరు కాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరోపక్క ప్రేరణ హౌస్ లో ఉన్నప్పుడు ‘సోనియా ని నేను బయటకి వెళ్లిన తర్వాత కూడా కలవను, ఆమె నాకు నచ్చలేదు’ అని చెప్పుకొచ్చింది. అలాంటి ఆమె నిన్న తన భర్త తో కలిసి పెళ్ళికి హాజరు కావడం గమనార్హం. చాలా క్లోజ్ అనుకున్న మనుషులు జీవితం లో జరిగిన ముఖ్య కార్యక్రమానికి హాజరు కాకపోవడం, శత్రువులు అనుకున్న వాళ్ళు, జీవితంలో ముఖం కూడా చూడకూడదు అనుకున్నోళ్ళు మాత్రం పెళ్ళికి హాజరై ఆశీర్వదించడం ఇప్పుడియూ సోషల్ మీడియా లో చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే సోనియా పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.