https://oktelugu.com/

Trending News : ఏడాదికి కోటి జీతం.. కులాసాగా జీవితం.. ఐనా వదులుకున్నాడు… డబ్బు లేకుండా ఎలా బతకాలో చెబుతున్నాడు?

ప్రతినెల 8 లక్షల పైగా జీతం. అంటే ఏడాదికి కోటి రూపాయలు.. ఇలాంటి ఉద్యోగాన్ని.. ఆర్థిక స్థిరత్వాన్ని అతడు వదులుకున్నాడు. హఠాత్తుగా రాజీనామా చేసి బయటికి వచ్చాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 21, 2024 / 12:58 PM IST

    Trending News

    Follow us on

    Trending News :  వాస్తవానికి అతడికి ఏడాదికి కోటి రూపాయలు వస్తోంది అనే మాటే గాని.. ఉద్యోగంలో విపరీతమైన ఒత్తిడి.. దానిని భరించలేక.. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి అతడు ఆ పని చేశాడు. వాస్తవానికి ఆస్థానంలో మరొకరు ఉంటే ఆ పని చేసేవారు కాదేమో. కాకపోతే అదే ఇప్పుడు మనం పాటించాల్సిన గెలుపు పాఠం అయింది. డబ్బు వేటలో పడి ఏం కోల్పోతున్నామో.. వేటికి దూరమయ్యామో చెబుతోంది. కోటి రూపాయలు వచ్చే ఉద్యోగాన్ని వదిలేసిన వ్యక్తి పేరు వరుణ్. అతడిది బెంగళూరు. ఒక బహుళ జాతి సంస్థలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఏడాదికి కోటి రూపాయల వేతనం వస్తున్న నేపథ్యంలో జీవితాన్ని అత్యంత విలాసంగా గడిపేవాడు. అయితే అతడి జీవితం టార్గెట్ల వెనుక పరుగులు పెట్టేది. మొదట్లో అతడికి అంతా బాగానే ఉండేది. ఆ తర్వాతే విసుగు వచ్చింది. ఒత్తిడి తట్టుకోలేక ఇబ్బందిగా అనిపించింది. చేస్తున్న పని కొండంత భారంగా అనిపించింది. దీంతో అతడు ఉద్యోగానికి రాజీనామా చేయాలి అనుకున్నాడు. మానసిక ప్రశాంతత పొందాలనుకున్నాడు. అతడికి ఉన్న ప్రతిభతో మరొకచోట కచ్చితంగా కొలువు సాధించగలడు. కానీ దానిని అతడు వద్దనుకున్నాడు. ఉద్యోగానికి రాజీనామా చేశా కంటే ముందు తన ఇంటికి చెల్లిస్తున్న రెంట్, ఇతర ఖర్చులు, హెల్త్ ఇన్సూరెన్స్, వివిధ పర్యటనలకు చెల్లించే మొత్తం.. ఒకచోట రాసుకున్నాడు. మూడు నెలలకు అయ్యే ఖర్చును మాత్రం ఎక్స్ సెల్ షీట్ లో రూపొందించుకున్నాడు. తన భార్య మోక్షద(ఆమె ఓ ఇంగ్లీష్ ప్రొఫెసర్) తో ఈ విషయాన్ని పంచుకున్నాడు. దీంతో అనవసర ఖర్చులకు చెక్ పెట్టుకోవాలని వారిద్దరు అనుకున్నారు. పొదుపులో మాత్రం కటింగ్స్ విధించలేదు. మంత్ ఎండింగ్ లో ఒకరి జీతం లేకుండా ఎలా బతకాలో ఒక అంచనాకు వారిద్దరు వచ్చేసారు. చేతికి వచ్చే మొత్తంతో 6 నెలల పాటు తక్కువ ఖర్చుతో జీవితాన్ని సాగించవచ్చని వారిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. హౌసింగ్ లోన్ లేకపోవడం.. గత ఖర్చుల జాబితా.. తగ్గించుకున్న వాటి వివరాలు.. ఇలాంటి వాటిని వదిలేయాలి.. ఇలా అన్ని విషయాలను వారు ఎక్స్ సెల్ షీట్ మొత్తంలో పెట్టి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..

    వారికి ఎంతో ఉపయోగం

    ఐటీ రంగంలో ఉద్యోగాలు తొలగించడం..పింక్ స్లిప్ లు జారీ చేయడం ఇటీవల పెరిగింది. వరుణ్ సవివరంగా ఎక్స్ సెల్ షీట్ లో ఖర్చుల వివరాలను పొందుపరచడం.. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఇది ఐటీ ఉద్యోగులకు.. ఉద్యోగాలు కోల్పోతున్న వారికి ఉపయుక్తంగా మారింది. ” ఉద్యోగాలు ఊడుతున్నాయి. వరుణ్ చెప్పిన సమాచారం ఎంతో బాగుంది. ఇది ఉద్యోగాలు కోల్పోతున్న మాకు భరోసా ఇచ్చింది. భారీ వేతనం లేకుండా జీవితాన్ని ఎలా సాగించాలో నేర్పింది. పొదుపు పాఠం అనేది అనుభవం నుంచి వస్తుంది. వరుణ్ అనుభవం అతడికే కాదు మాకు కూడా ఉపయోగంగా మారిందని” నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.