Venkat Prabhu: తెలుగు ఆడియన్స్ పై ‘ది గోట్’ డైరెక్టర్ వెంకట్ ప్రభు సెటైర్లు..ధోని అంటే తెలుగోళ్లకు ఇష్టం లేదా?

విజయ్ కి ఉన్న విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ సినిమాకి కలిసొచ్చింది అని చెప్పాలి. అక్కడ కూడా ఈ సినిమాకి నెగటివ్ రివ్యూస్ వచ్చాయి, కానీ కేవలం నాలుగు రోజుల్లోనే 274 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

Written By: Vicky, Updated On : September 10, 2024 5:00 pm

Venkat Prabhu

Follow us on

Venkat Prabhu: తమిళ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ‘లియో’ వంటి భారీ కమర్షియల్ బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై తమిళ ఆడియన్స్ తో తెలుగు ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. కానీ టాక్ అనుకున్న స్థాయిలో రాకపోవడంతో తెలుగులో ఓపెనింగ్స్ స్థాయి నుండే డిజాస్టర్ వసూళ్లను సొంతం చేసుకుంది. సినిమా విడుదలై 5 రోజులు అవుతుంది. ఈ 5 రోజుల్లో ఈ చిత్రం లియో తెలుగు వెర్షన్ మొదటి రోజు వసూళ్లను కూడా రాబట్టలేకపోయిందంటే, ఈ సినిమా ఏ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ అనేది అర్థం చేసుకోవచ్చు. కానీ ఇదే చిత్రం తమిళనాడు లో మాత్రం దుమ్ము లేపేస్తుంది.

అక్కడ విజయ్ కి ఉన్న విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ సినిమాకి కలిసొచ్చింది అని చెప్పాలి. అక్కడ కూడా ఈ సినిమాకి నెగటివ్ రివ్యూస్ వచ్చాయి, కానీ కేవలం నాలుగు రోజుల్లోనే 274 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సోమవారం నాడు కూడా ఈ చిత్రానికి అత్యధిక హౌస్ ఫుల్ షోస్ పడడంతో , ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం అప్పుడే 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను దాటేసింది. కచ్చితంగా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి లాంగ్ రన్ ఉంటుంది అనేది అందరికి అర్థం అయిపోయింది కాబట్టి, ఫుల్ రన్ లో ఈ చిత్రం 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి తెలుగు, హిందీ ఆడియన్స్ నుండి డిజాస్టర్ వసూళ్లు రావడం పై డైరెక్టర్ వెంకట్ ప్రభు స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘ నేను ఈ సినిమా క్లైమాక్స్ లో చెన్నై సూపర్ కింగ్స్, ధోని రిఫరెన్స్ పెట్టడం తెలుగు ఆడియన్స్ కి, హిందీ ఆడియన్స్ కి నచ్చలేదేమో. వాళ్లకి సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ టీమ్స్ ని పెట్టి ఉంటే సంతోషించేవారేమో. కానీ నేను చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్ ని, అలా చెయ్యలేను. అందుకే నా సినిమా తెలుగు ఆడియన్స్ నచ్చలేదేమో’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

అంటే వెంకట్ ప్రభు ఇప్పటికీ తాను ఒక గొప్ప సినిమా తీశానని, ఆ కలెక్షన్స్ తన సినిమా కంటెంట్ వల్ల మాత్రమే వచ్చిందని అనుకుంటున్నారు. కానీ ఆ వసూళ్లు విజయ్ కి ఉన్న అనితర సాధ్యమైన స్టార్ డమ్ వల్ల మాత్రమే వచ్చిందని ట్రేడ్ ని బాగా పరిశీలించిన వారు చెప్తున్న మాట. వెంకట్ ప్రభు తన టేకింగ్ స్టైల్ ని మార్చుకొని, తన తదుపరి చిత్రానికి మెరుగుపడకపోతే షెడ్ కి వెళ్ళిపోతాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ చెప్తున్న మాట.