Bank links : బ్యాంకులు ఇలాంటి లింక్ లు పంపిస్తే ఓపెన్ చేయొద్దు.. ఎందుకంటే?

బ్యాంకులో ఎప్పటి కప్పుడు కేవైసీని అప్డేట్ చేస్తూ ఉండాలి. అలా చేస్తేనే నిజమైన ఖాతాదారులు అని బ్యాంకు గుర్తిస్తుంది. లేకుంటే కొందరు అకౌంట్ ను హ్యాక్ చేసిన పెద్ద మొత్తంలో నగదును దోచుకుంటారు. అయితే ఈ మధ్య ఎక్కువ ఒక ఫైల్ మొబైల్ లో సర్క్యులేట్ అవుతోంది. ఆ ఫైల్ ఓపెన్ చేస్తే చాలు.. ఉన్నడబ్బులన్నీ మాయం అవుతున్నాయి. ఇంతకీ ఆ ఫైల్ ఎంటీ? అసలేం జరుగుతోంది?

Written By: Chai Muchhata, Updated On : September 10, 2024 5:02 pm

Bank links

Follow us on

Bank links : ప్రస్తుతం కాలంలో ఎక్కువ శాతం బ్యాంకు ద్వారానే నగదు లావాదేవీలు జరుపుతూ ఉంటారు. డబ్బులు వేయాలన్నా.. ఒకరికి పంపించాలన్నా.. బ్యాంకు సాయంతోనే సాగుతుంది. అయితే నేటి కాలంలో లిక్విడ్ క్యాష్ కంటే ఆన్ లైన్లో ఎక్కువ మొత్తంలోనైనా బదిలీ చేసుకోవచ్చు.ఈ క్రమంలో బ్యాంకుతో సత్సంబంధాలు కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుత కాలాంలో సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయి. దీంతో ఆన్ లైన్ లావాదేవీలు జరిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా బ్యాంకులో ఎప్పటి కప్పుడు కేవైసీని అప్డేట్ చేస్తూ ఉండాలి. అలా చేస్తేనే నిజమైన ఖాతాదారులు అని బ్యాంకు గుర్తిస్తుంది. లేకుంటే కొందరు అకౌంట్ ను హ్యాక్ చేసిన పెద్ద మొత్తంలో నగదును దోచుకుంటారు. అయితే ఈ మధ్య ఎక్కువ ఒక ఫైల్ మొబైల్ లో సర్క్యులేట్ అవుతోంది. ఆ ఫైల్ ఓపెన్ చేస్తే చాలు.. ఉన్నడబ్బులన్నీ మాయం అవుతున్నాయి. ఇంతకీ ఆ ఫైల్ ఎంటీ? అసలేం జరుగుతోంది?

చాల వరకు బ్యాంకులు కైవేసీ అప్డేట్ చేసుకోవాలని బ్యాంకులు సూచిస్తాయి. కానీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆన్ లైన్ లో కేవేసీని అప్డేట్ చేసుకోవాలని ఎప్పుడూ కోరదు. కానీ కొంత మంది అవగాహన లేకుండా బ్యాంకుకు వెళ్లాలంటే సమయం పడుతుందన్న కారణంతో ఆన్ లైన్ లోనే కొన్ని పనులు నిర్వహిస్తారు. అలాగే కేవేసీని కూడా ఇంటి వద్దే ఉండి అప్డేట్ చేసుకోవాలని చూస్తుంటారు. ఈ క్రమంలో కొందరు సైబర్ నేరగాళ్లో ప్రముఖ బ్యాంకుల పేరిట కొన్ని ఫైల్స్ పంపిస్తున్నారు. ఇవి వారికి నగదు మళ్లేలా తయారు చేస్తున్నారు. ఇవి ప్రముఖ బ్యాంకుల పేరుతో పంపిస్తున్నారు.

ఈ ఫైల్ ప్రముఖ బ్యాంకు పేరు ఉండి .apk అని చివరగా ఇలా ఉంటుంది. అయితే అవగాహన లేకుండా ఈ ఫైల్ ను ఓపెన్ చేయడం వల్ల సైబర్ నేరగాల్లకు సదరు వ్యక్తి డీటేయిల్స్ మొత్తం వెళ్తారు. ఈ సమాచారం ఆధారంగా వాళ్లు బ్యాంకు అకౌంట్ ను హ్యాక్ చేస్తారు. ఆ తరువాత బ్యాంకు నుంచి నగదును తస్కరిస్తారు. అందువల్ల ఈ ఫార్మాట్ లో వచ్చిన ఫైల్స్ ను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకుండా ఉండాలని ఇప్పటికే బ్యాంకులు సూచిస్తున్నాయి.

కేవైసీ అప్టేడ్ చేసుకోవాలంటే నేరుగా బ్యాంకుకు వెళ్లాలి. మాన్యువల్ కేవైసీకి కావాల్సిన పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకానీ బ్యాంకు పేరు చెప్పి ఎవరైనా లింక్స్ పంపించినా వాటిని ఓపెన్ చేయవద్దని బ్యాంకు అధికారులు సైతం తెలుపుతున్నారు. అంతేకాకుండా బ్యాంకుకు సంబందించిన ఖాతా నెంబర్ సైతం ఇతరులకు ఇవ్వకుండా జాగ్రత్త పడాలని అని అంటున్నారు. ప్రస్తుత కాలంలో మొబైల్ ద్వారానే మనీ ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. అందువల్ల మొబైల్ లో బ్యాంకు డీటేయిల్స్ ఉంటాయి. ఈ .apk ఫైల్స్ ఓపెన్ చేయడం వల్ల నేరుగా మనీ యాప్ లోకి వెళ్లి వాటికి సంబందించిన సమాచారం కూడా లీక్ అవుతుంది. మొత్తంగా బ్యాంకులకు సంబంధించి జరిపే వ్యవాహారాల్లో ఈ జాగ్రత్తలు పాటించాలి.