Junior NTR and Venkatesh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి స్టార్ హీరోలు సైతం ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండగా ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక నందమూరి నట వారసుడిగా తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ గా ఎదగడమే కాకుండా ప్రతి సినిమాతో తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి… వెంకటేష్ (Venkatesh), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కాంబినేషన్లో ఒకప్పుడు మల్టీ స్టారర్ నిమా చేయాలని ఒక స్టార్ డైరెక్టర్ సన్నాహాలు చేశాడు. కానీ అది కార్య రూపం దాల్చలేదు. క్రియేటివ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న కృష్ణవంశీ (Krishna Vamshi) వీళ్లిద్దరి కాంబినేషన్లో ఒక సినిమాని సెట్ చేయాలని తీవ్రమైన ప్రయత్నం చేసినప్పటికి అది కార్యరూపం దాల్చలేదు.
కారణం ఏదైనా కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా రాకుండా ఆగిపోవడం అభిమానులను తీవ్రమైన నిరాశకు గురిచేసింది… వెంకటేష్ హీరోగా యోగేష్ (Yogesh) దర్శకత్వంలో వచ్చిన చింతకాయల రవి (Chinthakayala Ravi) సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించి అటు వెంకటేష్ అభిమానులను, ఇటు తన అభిమానులను ఆనందపరచాడు.
Also Read : జూ.ఎన్టీఆర్ కు ఇదే సపోర్టు ముందునుంచి ఇచ్చుంటే నందమూరి కథ వేరే ఉండేది?
నిజానికి వెంకటేష్ కి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయి. వీళ్ళిద్దరూ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న వారే కావడం విశేషం…ఇప్పటికి ఎన్టీఆర్ వెంకటేష్ ని బాబాయ్ అని సంబోధిస్తూ ఉంటాడు. దానివల్ల వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ అయితే కుదిరింది…
ఎన్టీఆర్ వాళ్ళ తాత అయిన సీనియర్ ఎన్టీఆర్ అలాగే వెంకటేష్ ఫాదర్ అయిన డాక్టర్ డి రామానాయుడు మొదటి నుంచి చాలా సన్నిహితంగా ఉండేవారు.రామానాయుడు స్టార్ ప్రొడ్యూసర్ గా మారడానికి ఎన్టీఆర్ సైతం చాలా వరకు హెల్ప్ చేశాడు. అందువల్లే ఆ రెండు కుటుంబాల మధ్య అప్పటినుంచి ఇప్పటివరకు సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయి…