Junior NTR: ఎన్టీఆర్(NTR) అనే మూడు అక్షరాలా పేరు వింటే మన తెలుగు రాష్ట్ర ప్రజలు గర్వం తో మీసం మెలేస్తారు. తెలుగు జాతి వైభోగాన్ని ప్రపంచం నలుమూలలకు చాటి చెప్పిన మహానుభావుడు ఆయన. హీరో గా కళామ్మ తల్లికి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జనాలకు ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మరచిపోలేము. ఇప్పటికీ ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాల మీదనే మన రాష్ట్రము నడుస్తుంది అంటే ఎలాంటి అతిశయోక్తి లేదేమో. అలాంటి మహనీయుడి పేరు పెట్టుకున్న తర్వాత ఎంత బాధ్యతగా వ్యవహరించాలో ఆయన మనవడిగా వెండితెర అరంగేట్రం చేసిన జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) ని చూసి నేర్చుకోవాలి. రీసెంట్ గానే ఎన్టీఆర్ పేరుతో మరో నందమూరి వారసుడు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంగతి మన అందరికీ. హరికృష్ణ మనవడు, నందమూరి జానకి రామ్ తనయుడిగా ఈ ఎన్టీఆర్ వెండితెర అరంగేట్రం చేసాడు.
Also Read: బాలయ్య కాలు తొక్కినందుకు నన్ను సినిమా నుండి పీకేయాలని చూసారు – హీరోయిన్ లయ
ఇలా ఎంత మంది ఎన్టీఆర్ లు వస్తారు?, తాతకి తగ్గ మనవడు అంటే, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. పెద్దాయన ఏ లోకంలో ఉన్నా, జూనియర్ ఎన్టీఆర్ ని చూసి గర్విస్తూ ఉంటాడు. అలాంటి మహనీయుడి పేరుని పెట్టుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అర్హుడు, ఎవరు పడితే వాళ్ళు పెట్టుకొని ఆయన పేరుని చెడగొట్టకండి అంటూ కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నాడు. అయితే ఈ కొత్త ఎన్టీఆర్ మొదటి సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి, అదే విధంగా బీజేపీ ఎంపీ పురందేశ్వరి లతో పాటు నందమూరి, నారా కుటుంబానికి సంబంధించిన వారంతా హాజరయ్యి కొత్త ఎన్టీఆర్ ని దీవించారు. అయితే కొత్త ఎన్టీఆర్ కి ఇంత సపోర్ట్ గా రెండు కుటుంబాలు నిలిచాయి కానీ, జూనియర్ ఎన్టీఆర్ కి ఎందుకు అలా నిలబడలేదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి ఎదురు అవుతున్న ప్రశ్న.
2001 వ సంవత్సరం లో ఎన్టీఆర్ ‘నిన్ను చూడాలని’ అనే చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసాడు. ఈ సినిమా ఎప్పుడు మొదలైంది?, ఎప్పుడు విడుదలై థియేటర్స్ లో ఆడి వెళ్ళింది అనేది అప్పట్లో ఎవరికీ తెలిసేది కాదు. అంత లౌ ప్రొఫైల్ తో ఆ సినిమా తెరకెక్కింది. ఇప్పుడు కొత్త ఎన్టీఆర్ కి చేసిన హంగామా, ఆరోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ కి చేసి ఉండుంటే ఏ రేంజ్ లో ఉండేది. కేవలం తన సొంత టాలెంట్ ని నమ్ముకొని జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ ని మొదలు పెట్టాడు. అదే సమయంలో ఆయనకు అదృష్టం కూడా బాగా కలిసొచ్చింది. రాజమౌళి లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ మొదటి సినిమా ఎన్టీఆర్ తోనే చేసాడు, అది పెద్ద హిట్ అయ్యింది, అదే విధంగా వీవీ వినాయక్ లాంటి ఊర మాస్ డైరెక్టర్ మొదటి సినిమా కూడా ఎన్టీఆర్ తోనే, ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలా తన సొంత టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కలిసి రావడం తో నేడు తెలుగు సినీ ఇండస్ట్రీ గర్వించదగ్గ హీరోలలో ఒకడిగా ఎన్టీఆర్ నిల్చాడు.
Also Read: జబర్దస్త్ మాజీ యాంకర్ కష్టాలు, చివరికి ఎంగిలి మెతుకుల కోసం ఎదురు చూసిందా?