Custody Advance Bookings: ప్రస్తుతం ప్రేక్షకులు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు.రీసెంట్ గా విడుదలవుతున్న సినిమాలు కొన్ని టీజర్ మరియు ట్రైలర్ బాగున్నప్పటికీ కూడా ధైర్యం చేసి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా టికెట్స్ కొనుగోలు చెయ్యడం లేదు. టాక్ అద్భుతంగా వస్తేనే థియేటర్స్ కి కదలడానికి చూస్తున్నారు. టాక్ రాకపోతే కనీసం థియేటర్ వైపు కూడా చూడడం లేదు, ఫలితంగా ఫ్లాప్ అయిన సినిమాలు కేవలం వారం రోజులు కూడా థియేటర్స్ లో ఉండలేకపోతున్నాయి.
అందుకు రీసెంట్ ఉదాహరణ అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ‘ఏజెంట్’ చిత్రం. కనీసం ఓపెనింగ్స్ కూడా దక్కించుకొని ఈ సినిమా కేవలం వారం రోజులు మాత్రమే థియేటర్స్ లో ఆడింది. ఈ సినిమా ప్రభావం పాపం నాగ చైతన్య లేటెస్ట్ చిత్రం ‘కస్టడీ’ మీద పడింది. అక్కినేని ఫ్యాన్స్ ప్రస్తుతం తీవ్రమైన నిరాశలో ఉండడం వల్ల, ఈ చిత్రాన్ని కూడా పట్టించుకోవడం లేదు.
ఈమధ్య వచ్చిన అక్కినేని కుటుంబ సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని రీతిలో బోల్తా కొట్టడం వల్ల , జనాల్లో వీళ్ళ సినిమా అంటేనే బాగుండదు అనే అభిప్రాయం ఏర్పడిపోయింది, అందుకే ఆ ప్రభావం ‘కస్టడీ’ మీద కూడా పడింది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన టీజర్ మరియు ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నాగ చైతన్య కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయే చిత్రం అవుతుంది అనే సంకేతం కూడా ఇచ్చేసింది. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం టీజర్ మరియు ట్రైలర్ కి తగ్గట్టుగా అసలు లేదు.
ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి ఆన్లైన్ బుక్ మై షో యాప్ ద్వారా జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ సేల్స్ గ్రాస్ కేవలం 56 లక్షల రూపాయిలు మాత్రమే, ఇది కేవలం హైదరాబాద్ కి చెందిన డేటా. సినిమాకి మంచి ఓపెనింగ్ రావాలంటే కచ్చితంగా టాక్ అల్ట్రా పాజిటివ్ గా ఉండాలి, అప్పుడే సాధ్యపడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఇక ఆంధ్ర ప్రదేశ్ లో కూడా బుకింగ్స్ అంతంతమాత్రం గానే ఉన్నాయి.చూడాలి మరి ఈ సినిమాకి అనుకున్న విధంగా టాక్ వస్తుందో లేదో అనేది.