Ugram Collections: అల్లరి నరేష్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఉగ్రం’ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజి టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వసూళ్లు కూడా యావరేజి రేంజ్ లోనే వస్తున్నాయి,కానీ బ్రేక్ ఈవెన్ కి ఆమడ దూరం లోనే ఆగిపోయ్యేట్టు అనిపిస్తుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 6 కోట్ల రూపాయలకు పైగానే జరిగింది.
ఈ సినిమా సూపర్ హిట్ రేంజ్ లో నిలవాలంటే 8 కోట్ల రూపాయిల రేంజ్ వసూలు చెయ్యాలి, హిట్ రేంజ్ కి రావాలంటే కచ్చితంగా 6 కోట్ల రూపాయిలు దాటాల్సిందే, యావరేజికి 4 కోట్ల రూపాయిలు, ఎబోవ్ యావరేజి కి 5 కోట్ల రూపాయిలు రాబట్టాల్సి ఉంటుంది. నాలుగు కోట్ల రూపాయిలకంటే తక్కువ వసూళ్లను రాబడితే ఫ్లాప్ క్రిందే లెక్కగడుతారు ట్రేడ్ పండితులు.ప్రస్తుతం ఈ చిత్రం ఏ రేంజ్ దగ్గర ఆగిపోయ్యే ఛాన్స్ ఉందో చూద్దాము.
ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం, ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 2 కోట్ల 63 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. వీకెండ్ పూర్తి అయిన తర్వాత ఈ చిత్రానికి నాల్గవ రోజు 30 లక్షల రూపాయిలు, ఐదవ రోజు 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి, ఇక ఆరవ రోజు కేవలం 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. అలా మొత్తం మీద ఈ సినిమా యావరేజి గా 2 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది.
ఈ వీకెండ్ తో ఈ చిత్రం నాలుగు కోట్ల రూపాయిల మార్కుని టచ్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. అంటే ఫైనల్ బాక్స్ ఆఫీస్ ఫలితం యావరేజి అని చెప్పొచ్చు.ఈ వారం లో నాగ చైతన్య ‘కస్టడీ’ చిత్రం విడుదల కాబోతుంది, ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం ‘ఉగ్రం’ ఈ వీకెండ్ కూడా నడవడం కష్టం,చూడాలి మరి ఫైనల్ కలెక్షన్స్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో.