https://oktelugu.com/

Adah Sharma Remuneration: ‘ది కేరళ స్టోరీ’ సినిమాకి అదా శర్మ అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? అదృష్టం అంటే ఇదే!

స్టార్ హీరోయిన్ అవ్వడానికి అన్నీ రకాల అర్హతలు ఉన్నప్పటికీ మీడియం రేంజ్ హీరోయిన్ గా మిగిలిపోవడం అనేది, ఈమె అభిమానులు ఎంతగానో నిరాశకి గురయ్యేలా చేసింది.

Written By:
  • Vicky
  • , Updated On : May 11, 2023 / 07:33 AM IST

    Adah Sharma Remuneration

    Follow us on

    Adah Sharma Remuneration: పూరి జగన్నాథ్ మరియు నితిన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘హార్ట్ అటాక్’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది అదా శర్మ. తొలిసినిమాతోనే తన అందం మరియు అభినయం తో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. ఆ తర్వాత ఈమెకి అవకాశాలు వచ్చాయి కానీ, పెద్ద బ్రేక్ మాత్రం రాలేదు. దాంతో ఈమె కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ రోల్స్ కూడా చెయ్యాల్సి వచ్చింది.

    స్టార్ హీరోయిన్ అవ్వడానికి అన్నీ రకాల అర్హతలు ఉన్నప్పటికీ మీడియం రేంజ్ హీరోయిన్ గా మిగిలిపోవడం అనేది, ఈమె అభిమానులు ఎంతగానో నిరాశకి గురయ్యేలా చేసింది. అయితే ఇన్ని రోజులు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆమెకి నడుస్తున్న టైం మరొక ఎత్తు. హిందీ లో రీసెంట్ గా విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ సినిమాలో మెయిన్ లీడ్ గా నటించి సెన్సేషన్ సృష్టించింది.

    ఈ చిత్రం ప్రస్తుతం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని ఏ రేంజ్ లో శాసిస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.మొదటి రోజు 8 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, రెండవ రోజు 11 కోట్ల రూపాయిలు, మూడవ రోజు 16 కోట్ల రూపాయిలు , నాల్గవ రోజు 10 కోట్ల రూపాయిలు, ఐదవ రోజు 11 కోట్ల రూపాయిలు వసూలు చేసి ఓవరాల్ గా 5 రోజుల్లో 56 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇందులో అదా శర్మ నటనకి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఓవర్ నైట్ పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది.

    ఇక ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆమెకి నిర్మాతలు ఏకంగా 5 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఇచ్చారట. ఒకప్పుడు ఆమె రెమ్యూనరేషన్ 50 లక్షల కంటే తక్కువ ఉండేది. ఇప్పుడు ఒకే ఒక్క సినిమాతో ఏకంగా 5 కోట్ల రూపాయిలు అందుకునే రేంజ్ కి వెళ్ళింది. ఇదే ఊపుని ఆమె తన భవిష్యత్తులో కూడా కొనసాగిస్తూ అగ్ర కథానాయికలలో ఒకరిగా నిలుస్తుందో లేదో చూడాలి.