https://oktelugu.com/

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ పై ఇంస్టాగ్రామ్ లో సంచలన పోస్ట్ పెట్టిన సోనియా..ఆడియన్స్ జర జాగ్రత్త!

ఈమె హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది అని. అయితే ఇలాంటి రీ ఎంట్రీలు ఉన్నప్పుడు బయట సోషల్ మీడియా లో చెప్పడం పూర్తిగా నిషేధం. ఎందుకంటే అవి రహస్యంగా ఉంచాలి, ఇలా పబ్లిక్ గా అందరికీ అర్థం అయ్యేట్టు పెడితే బిగ్ బాస్ టీం ఒప్పుకోదు.

Written By:
  • Vicky
  • , Updated On : October 13, 2024 / 09:24 PM IST

    Sonia akula

    Follow us on

    Bigg Boss Telugu 8:  బిగ్ బాస్ హౌస్ లో ఉన్న నాలుగు వారాల్లోనే తనదైన మార్కుని చూపిస్తూ హౌస్ మొత్తాన్ని షేక్ చేసిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది సోనియానే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బిగ్ బాస్ హిస్టరీ లోనే సోనియా ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు. నెగటివ్ యాంగిల్ లోనే ఆమె పాపులర్ అయ్యింది కానీ, తక్కువ రోజుల్లో ఇంతటి బలమైన ప్రభావం చూపించిన కంటెస్టెంట్ మరొకరు లేరు. హౌస్ లో ఉన్నన్ని రోజులు హౌస్ మేట్స్ ఈమె గురించే ఎదో ఒకటి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అంతటి కంటెంట్ ని ఇచ్చింది ఈమె. సోనియా ఎలిమినేషన్ అయిన రోజు నుండే ఆమె రీ ఎంట్రీ మళ్ళీ ఉంటుందని సోషల్ మీడియా లో ఒక వార్త ప్రచారం అయ్యింది. ఇది కేవలం రూమర్ ఏమో అని చాలా మంది అనుకున్నారు. కానీ నిజంగానే సోనియా రీ ఎంట్రీ అతి త్వరలోనే ఉండబోతుందని రీసెంట్ గా ఆమె ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక స్టోరీ ని చూస్తే అర్తమయింది. ఇటు వైపు ఒక కన్నేసి ఉంచండి, ఒక ఆసక్తికరమైన విషయాన్నీ చెప్పబోతున్నాను అంటూ ‘సోనియా 2.0’ అని ఒక స్టోరీ పెట్టింది.

    దీంతో అర్థమైపోయింది, ఈమె హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది అని. అయితే ఇలాంటి రీ ఎంట్రీలు ఉన్నప్పుడు బయట సోషల్ మీడియా లో చెప్పడం పూర్తిగా నిషేధం. ఎందుకంటే అవి రహస్యంగా ఉంచాలి, ఇలా పబ్లిక్ గా అందరికీ అర్థం అయ్యేట్టు పెడితే బిగ్ బాస్ టీం ఒప్పుకోదు. మరి ఆమె చెప్పబోయేది బిగ్ బాస్ కి సంబంధించిన వార్తనేనా?, లేకపోతే ఏదైనా సినిమాలో హీరోయిన్ గా కానీ, ముఖ్య పాత్రకి కానీ ఒప్పుకొని, ఆ విషయం చెప్పేందుకే ఇలా పెట్టిందా అనేది తెలియాల్సి ఉంది. గత సీజన్ లో నాల్గవ వారం ఈమె స్థాయిలోనే నెగటివిటీ ని తెచ్చుకొని బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్తుంది రతికా. మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి ఆరవ వారం అడుగుపెడుతుంది. రీ ఎంట్రీ తర్వాత ఆమె ఇంకా నెగటివిటీ ని మూటగట్టుకొని వెళ్ళింది.

    ఇప్పుడు సోనియా ఒకవేళ రీ ఎంట్రీ ఇస్తే రతికా స్థాయిలోనే నెగటివిటీ ని మూటగట్టుకుంటుందా?, లేకపోతే తన మీద జనాల్లో ఏర్పడిన నెగటివిటీ ని మొత్తం పాజిటివ్ చేసుకుంటుందా అనేది చూడాలి. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత ఈమె బిగ్ బాస్ షో మీద ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. 30 సంవత్సరాలు కస్టపడి సంపాదించుకున్న పేరు మొత్తం బిగ్ బాస్ వాళ్ళు నాశనం చేసారని, తనని మొత్తం నెగటివ్ యాంగిల్ లో చూపించారని, నాగార్జున హోస్ట్ గా వేస్ట్ అని ఇలా ఎన్నో రకాల వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. మరి ఇంతలా మాట్లాడిన ఈమెను బిగ్ బాస్ టీం మళ్ళీ రీ ఎంట్రీ ఇప్పిస్తుందా లేదా అనేది ఈ వారం లో తెలియనుంది.