The Bengal Files Review: చాలా మంది దర్శకులు భారతదేశపు చరిత్రలో జరిగిన కొన్ని విషయాలను వెలికి తీసి ట్రూ ఇన్సిడెంట్స్ తో సినిమాలను చేస్తూ భారీ విజయాలను సాధిస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ‘ ద బెంగాలీ ఫైల్స్’ అనే సినిమాతో పశ్చిమబెంగాల్లో జరిగిన కొన్ని సంఘటనలను ప్రేక్షకుప ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేశారు. మరి ఇలాంటి సందర్భంలోనే ద బెంగాల్ ఫైల్స్ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే 1947వ సంవత్సరంలో ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియా పాకిస్తాన్ ఎలా విడిపోయింది. అందులో గాంధీజీ ఎలాంటి పాత్రను పోషించాడు. అప్పుడు హిందువులు, ముస్లిమ్స్ మధ్య ఎలాంటి గొడవలు చెలరేగాయి. ఎవరు ఎవరిని ఎందుకు చంపారు. ఎందువల్ల ఈ అనార్ధాలు అన్ని జరిగాయి అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి 1947 వ సంవత్సరంలో బెంగాల్లో జరిగిన విషయాలను ప్రస్ఫుటంగా వివరించే ప్రయత్నం అయితే చేశాడు. మరి హిందువులకు ముస్లింలకు మధ్య ఎలాంటి గొడవలు వచ్చాయి అనే విషయాన్ని కూడా ఈ సినిమాలో చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. మొత్తానికైతే ఈ సినిమా ద్వారా హిందువులు ముస్లింల మధ్య ఎలాంటి గొడవలు జరిగాయి. దానిని రాజకీయ ప్రయోజనాల కోసం నాయకులు ఎలా వాడుకున్నారు. ఇండియా పాకిస్థాన్ దేశాలను ఎలా విడదీశారు.
వాళ్ల మధ్య ఎలాంటి ఒప్పందాలు జరిగాయి. అనే విషయాలను కూడా ఇందులో పుష్పటంగా తెలియజేశారు. ఇక దర్శకుడు మొదటి నుంచి కూడా డ్రామటైజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లిన విధానం అయితే బాగుంది. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ని చెప్పే ప్రాసెస్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అనే ఒక కొత్త కోణాన్ని కూడా మనకు ఈ సినిమాలో ఆవిష్కరించి చూపించడం జరిగింది…ఇక మొత్తానికైతే ఈ సినిమా వల్ల కొన్ని నిజాలు జనానికి తెలియజేయాలనే ప్రయత్నం చేశారు. కొన్ని సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకుంటాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇక అమ్మాయిల విషయంలో ఎవరు ఎలా బిహేవ్ చేశారు. ఎవరు ఎంతమంది మానాలను, ప్రాణాలను తీశారు అనే విషయాన్ని కూడా ఇందులో చూపించారు. సెకండాఫ్ కి వచ్చేసరికి మానవత్వాన్ని చూపించే సీన్స్ అయితే ఎలివేట్ అయ్యాయి. ముఖ్యంగా కొన్ని డైలాగులు సైతం ప్రేక్షకుడిని ఆకట్టుకున్నాయి. ఇక ఆ డైలాగులకు ప్రేక్షకుడి కండ్లల్లో నుంచి కన్నీరు కూడా వచ్చాయి…ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తె దర్శన్ కుమార్ చాలా బాగా నటించి మెప్పించాడు. తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించాడు. ఇక అలాగే మిథున్ చక్రవర్తి సైతం ఎక్కడ డివియేట్ అవ్వకుండా తన పాత్రలో ఒదిగిపోయి నటించి పాత్రను తను తప్ప ఎవరూ చేయలేరు అనే ఒక గొప్ప గుర్తింపు అనేది సంపాదించుకున్నాడు. ఇక అనుపమ్ కేర్ గాంధీజీ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. ప్రస్తుతం ఆయన పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిందనే చెప్పాలి. ఎక్కడ కూడా తను డివియేట్ అవ్వలేదు. ఆ పాత్ర పరిధి ఏ మేరకు ఉందో ఆ లిమిటేషన్స్ క్రాస్ చేయకుండా ప్రతి ఎక్స్ప్రెషన్ ని చాలా ఎఫెక్టివ్ గా చెబుతూ ప్రేక్షకుడి యొక్క దృష్టిని ఆకర్షించాడు…. ఇక మిగిలిన ఆర్టిస్టులందరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో బ్యా గ్రౌండ్ స్కోర్ వల్లే అవి ఎలివేట్ అయ్యాయి… ఇక విజువల్స్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా భారీ విజువల్స్ ని అందించారు. ముఖ్యంగా ఒకరినొకరు చంపుకునే సన్నివేశంలో అయితే విజువల్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. కెమెరా డిఫరెంట్ యాంగిల్స్ లో ముందుకెళ్తూనే ఒక్కొక్కరి మరణాన్ని చూపించుకుంటూ చాలా బాగా తీసుకెళ్లారు… ఎడిటింగ్ కూడా చాలా బాగా కుదిరింది… ప్రొడక్షన్ వాల్యూస్ సైతం అద్భుతంగా ఉన్నాయి…
ప్లస్ పాయింట్స్
కథ
డైరెక్షన్
ఎమోషన్ సీన్స్
మైనస్ పాయింట్స్
అక్కడక్కడ కొన్ని సీన్స్ బోర్ కొట్టాయి…
ఎక్కువ వయోలెన్స్ ఉంది…
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.75/5
